అనంతపురంలో అమ్మవారు కళ్ళు తెరిచారు….. ఇది నిజం…! ( వీడియో)

అనంతపురం ఇదే విశేషం. వింత ఎక్కడ చూసినా ఇదే చర్చ అమ్మవారు కళ్ళు తెరిచారు. ఏ ఒక్కరి నోట విన్నా ఇదే వినిపిస్తోంది. ఆశ్చర్యపోయి మరీ కథకథలుగా చెప్పుకుంటున్నారు.

అభిషేక సమయంలో భక్తులకు అమ్మవారు ఆశ్చర్యకరంగా దర్శనమిచ్చారు. వివరాలు

అనంతపురం పట్టణంలోని పాత ఊరులో మంగళవారం తెల్లవారు జామున అభిషేకం జరుగుతోంది. ఒక వైపు అర్చకులు అభిషేకం నిర్వహిస్తున్నారు.

లక్ష పసుపుకొమ్ములనోము (పూజలు ) సందర్భంగా అభిషేకానికి వచ్చిన భక్తులు ఆశ్చర్యం కలిగించే దృశ్యం అక్కడ ఆవిష్కృతమయ్యింది.

ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు సంభమాశ్చర్యాలలో మునిగి తేలారు.

అభిషేకం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారు కళ్ళు తెరిచి మూస్తున్నట్లు కనిపించడంతో భక్తులు పరవశించిపోయారు.

అమ్మవారు నిజంగా కరుణించారో…. అది యాదృశ్చికమో తెలియదు గానీ, అక్కడ ఆవిష్కృతమైన దృశ్యాలను అనంతపురం పట్టణ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

కళ్ళు తహరుస్తున్న అమ్మ అమ్మా అంటే ఆదరిస్తుందని అర్థమంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.

అమ్మలగన్న అమ్మ శ్రీవాసవాంబ అంటారని ఆ దేవస్థానం అధ్యక్షులు పార్శం సత్యనారాయణ మహిళా విభాగం కార్యదర్శి చల్ల లతలు ఉద్ఘాటించారు.

[embedyt] https://www.youtube.com/watch?v=C33A0uJ1hK8[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*