
దేవుడికి కొట్టే కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి జాతకాలు చెప్పవచ్చా. టెంకాయ రెండు చక్కలుగా పగిలితే దేనికి చిహ్నం? లేదా వంకర్లు పగిలితే దేనిని తెలియజేస్తుంది?
తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వార్త చదవాల్సిందే.. కొబ్బరి కాయ పగిలే విధానాన్ని అనుసరించి శుభమా..? అశుభమా అని పెద్దలు చెబుతుండేవారు.
కానీ, కొబ్బరి పగిలే విధానాన్ని అనుసరించి సంతాన యోగాన్ని కూడా చెప్పవచ్చట.
కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ, కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి.
అప్పుడే అది అడ్డంగా..చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. పెద్ద కన్ను అంటే వెడల్పుగా ఉండే భాగం తగిలేలా కొడితే 90 శాతం కొబ్బరికాయ సమానంగా పగలుతుంది.
అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే మనసును ఏకాగ్రతగా ఉంచుకుని శ్రద్ధగా, మనసులోని ధర్మబద్ధమైన కోరికతో కొబ్బరి కాయ కొడితే రెండు చక్కలుగా చక్కగా పగులుతుందని భావిస్తారు.
అంతే కాదు, ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు.
కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానావంకరలుగా పగులుతుంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే, మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తుంది.
ఒకవేళ కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగిలితే, చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు.
కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ … కోడలుగాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు.
అందుకే ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్నినింపుకుని, పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతుంటారు.
ఇంకెందుకు ఆలస్యం… ఈ పర్యాయం టెంకాయ కొట్టేటప్పుడు మీ తీరేంటో తెలుసుకోండి.
Super