ఆ దేవాలయంలో దేవుడు నైవేద్యాన్ని అందరూ చూస్తుండగానే తినేస్తారు. తెలుసా…?

ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టిన ప్రతిసారి దేవుడు ఆరగిస్తారు. ఇది నిజం… ఒక్కసారిగా అక్కడ ఆ దేవుడికి అర్చకులు ఏకంగా ఏడుమార్లు నైవేద్యం పెడతారు.

ఆశ్చర్యంగా ఉంది కదూ. మీరు ఆశ్చర్యపోవడంలోనూ తప్పులేదు. అలాగని అక్కడ జరుగుతున్న తప్పో, కల్పితమో అస్సలు కాదు.

నిజంగా ఆ దేవుడు నైవేద్యం ఆరగిస్తాడు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడా అనేగా మీరు అడుగుతున్నది.

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా తిరువరపు శ్రీ కృష్ణ దేవాలయం. ఇక్కడ కృష్టుడు చాలా చాలా ఆకలి మీద ఉంటాడు. గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంచుతారు.

ఇక్కడ స్వామికీ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. నైవేద్యం పెట్టిన ప్రతీమారు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇందులో తలుపులు మూసినప్పుడో లేదా అక్కడ ఎవరు లేనప్పుడో కాదు.

అందురూ చూస్తుండగానే, అర్చకులు అక్కడే ఉండగానే కాస్తంత తగ్గుతుంది. స్వామి స్వయంగా నైవేద్యాన్ని తింటారని ఇక్కడి ప్రజల నమ్మకం. విశ్వాసం. అందుకే నైవేద్యం తగ్గుతోందని భావిస్తారు.

కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవుతుందట. ఇందుకు నిదర్శనం కూడా చూపుతన్నారు.

స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు.

పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడంతో గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ ఆలయాన్ని మూయ కూడదని నిర్ణయించారు.

ఇక్కడ స్వామికి నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ఇక్కడ ఇంకో నియమం ఉంది.

ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదు. అందుకే అర్చకులు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా? అని పెద్ధగా అరిచి మరీ ప్రసాదం పంపిణీ చేస్తారు.

ఈ ఆలయంలో దేవుడు నైవేద్యాన్ని ఆరగించడంపై శాస్త్రవేత్తల తేల్చాలని చూసి అంతు చిక్కక మిన్నకుండిపోయారట.

అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.

ఇక్కడి అర్చకుడి చేతిలో ఎప్పుడూ గొడ్డలి ఉంటుంది. అదేదో క్రూర జంతువులను నరకడానికి కాదు.

ఆలయాన్ని తెరవడంలో ఆలస్యం అయితే ఏమాత్రం ఆలోచించకుండా తాళం బద్దలు కొట్టి ఆలయం తెరచి స్వామికి కైంకర్యాలు చేస్తారు.

గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శిస్తారు. స్వామిని కొలుస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*