ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఏమవుతుంది? చచ్చిపోతామా?

మనం ఎప్పుడైనా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకుంటే మన బామ్మో… తాతయ్యో ఉంటే అటుగా తల పెట్టుకోవద్దని, పడమర దిక్కున తలపెట్టి పడుకోమంటారు… గుర్తుకు తెచ్చుకోండి.

అవును నిజమే.. వారు చెప్పేవారు. మాన నానమ్మ అయితే అదే చెప్పేది. అమాయకంగా ఎందుకని అడిగే వాడిని. మాది పల్లెటూరు. బహుశా కారణం ఆమెకు తెలియదేమో. అందుకే ఇలా చెప్పేది.

మన పెద్దోళ్ళు చెప్పేవారు. అలా ఉత్తరం దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చనిపోతారని చెప్పేవారు. మరికొందరు అనేవారు భయంకరమైన పీడకలలు వస్తాయని. అప్పట్లో అర్థమయ్యేది కాదు.

కానీ, ఉత్తర దిక్కున తలపెట్టి పడుకుంటే ఏమవుతుందని తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం తగ్గలేదు. మరో అర్చకుడిని ప్రశ్నించాను ఆయన ఇలా చెప్పారు.

పార్వతీదేవి స్నానం చేస్తూ ఎవరినీ రానివ్వకుండా వినాయకుడిని కాపా పెట్టిందట. ఆ సమయంలో ఈశ్వరుడు వచ్చాడు. ఈశ్వరుడిని వినాయకుడు లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నాడు.

ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. యుద్దంలో ఈశ్వరుడు వినాయకుడి తల ఖండిస్తాడని, పార్వతీ దేవి బయటకు వచ్చి చూసిన బోరున విలపించింది.

తరువాత వినాయకుడు బతికించాలని కోరడంతో ఉత్తరదిక్కున తలపెట్టుకుని పడుకుని ఉన్న ఏనుగు తలను పెడతారట. అందుకే వినాయకుడు ఏనుగు తలతో ఉంటాడు. అందుకని ఉత్తరానా తలపెట్టుకోకూడదని అంటారు.

అసలు విషయం ఏంటి? భారతీయ సనాతన సాంప్రదాయాలలో మానవాళికి మేలు జరిగే ఏదోక రహస్యం దాగి ఉంటుంది. అసలు నిజం ఏంటంటే,

మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర, దక్షిణ ధృవాల నడుమ ప్రసారం అవుతూ ఉంటుంది. అది ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవం వైపునకు ప్రసరిస్తుంది.

మనం ఉత్తర దిక్కున తలపెట్టి పడుకున్నప్పుడు ఆ శక్తి యొక్క తరంగాలు మన మెదడుపై ప్రభావాన్ని చూపుతాయి.

దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పువస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి.

అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉంది మెరుగు పడుతుంది. రక్త ప్రసరణసరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*