ఆ బండలేకపోతే… అమ్మో… కేధారీనాథ్ కొట్టుకుపోయేదా?

ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదలు ఇంకా గుర్తుండే ఉంటాయి. జల ప్రళయం అంటే ఏంటో ఆ రాష్ట్రం చవి చూసింది. మామూలు నష్టం కాదు. పూడ్చుకోలేని నష్టం.

ఆ వరదల్లో కేథారీనాథ్ ఆలయం కూడా మూతపడింది. తెలుగురాష్ట్రాల నుంచి వెళ్ళిన వారు ఏమయ్యారో తెలియక మన రాష్ట్రాలు తల్లడిల్లిపోయాయి. సరిగ్గా ఆరున్నరేళ్ళ కిందట జరిగిన ఈ సంఘటన అందరినీ కలవర పెట్టింది.

2013లో సంభవించిన వరదల్లో 197 మరణించగా 236 మంది గాయపడ్డారు. అన్నింటికి మించి 4,021 ఆచూకీ లేకుండా పోయారు. అంటే వారు కొట్టుకుపోయారు.

ఇంచుమించు 17వేల ఇల్లు దెబ్బతిన్నాయి. వీలో నామరూపాల్లేకుండా పోయిన పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. కానీ, అప్పుడెప్పుడో నిర్మించిన కేదారనాథ్ గుడి మాత్రం నిటారుగా అలాగే నిలబడిపోయింది ఎలా?

అది వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరదల తరువాత అక్కడికెళ్ళి చూస్తే గుడి చుట్టూ విధ్వంసం, శవాలు, జంతు కళేబరాలు దర్శనమిచ్చాయి.

ఒక గుడి మినహా మరేవి కనిపించలేదు. నామరూపాల్లేకుండా పోయాయి. ఆశ్చర్యం కలిగింది ఆ ప్రాంతానికి వెళ్ళి చూసిన వారందరికీ,

తీరా గుడి వెనుక బాగానికి వెళ్ళి చూస్తే మునుపెన్నడూ లేని ఓ పెద్ద బండారాయి దర్శనమిచ్చింది. వందల వేల టన్నులు బరువున్న బండారాయి ఆగి ఉంది.

పై భాగంలోని కొండల్లోంచి అంత పెద్ద బండరాయి కొట్టుకువచ్చిందంటే ఇక ఆలోచించండి ఎంత పెద్ద జలప్రళయం వచ్చిందో. అదే బండరాయి నేరుగా ఆలయాన్ని ఢీకొని ఉంటే.

ఇంకేముంది? ఆలయం పడిపోయేది. ఇది మనం మామూలుగా ఆలోచిస్తాం. కానీ, అదే బండరాయి ఆ ఆలయాన్ని కాపాడింది. వేగంగా పరుగులు తీస్తూ వచ్చిన నీటి ప్రవాహాన్ని ఆ బండరాయే నిలువరించింది.

గుడిపైకి రాకుండా నిలిపింది. వేగంగా అక్కడకు వచ్చిన నీటి ప్రవాహం బండరాయిని తాకి రెండు పాయలుగా చీలిపోయింది. దీంతో గుడిని తాకే నీటి ఫోర్సు తగ్గిపోయింది.

ఫలితంగా గుడి రక్షించబడింది. ఇది నిజంగా శివుడి మాయేనని ఆ ప్రాంతవాసులు నమ్ముతారు. ఆ గుండుకు పూజలు చేసిన వారు కూడా ఉన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*