వాసవి కన్యకాపరమేశ్వరి దేవి గ్రామోత్సవ ఆహ్వానం అనంతపురం క్రొత్తవూరు ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్ధ అయిన వాసవి దీక్షా సమితి అద్వర్యంలో సోమవారం సాయింత్రం 4.00 గంటలకు వాసవి కన్యకాపరమేశ్వరి దేవి గ్రామోత్సవం వైశ్యాహాస్టల్ ప్రాంగణం నుండి ప్రారంభమయ్యింది.
ఈ గ్రామోత్సవంలో సేలం వారిచే 9 అడుగుల ఎత్తు కూర్చున్న అమ్మవారు అలంకారం, 102 మంది కన్యకల జ్యోతులతో, 102 మంది మహిళలలు కలశాలతో, వాసవి మహిళామండలి వారిచే కోళాటాలు, మైదుకూరు వారిచే నవదుర్గ వేషాలతో అద్బుతమైన రంగు రంగుల దీపాలతో భారీ ఎత్తున ఈ గ్రామోత్సవం ఏర్ఫాటు చేయడమైనది.
వైశ్యాహాశ్టల్ నందు 3:45 నిమిషములకు అల్పాహారం ఏర్ఫాటు చేశారు. ఈ గ్రామోత్సవం కంఠం సర్కిల్, తిలక్ రోడ్, గాంధీ బజార్, సుభాష్ రోడ్ మీదుగా రాత్రి 9.00 గంటలకు వాసవీ రోడ్ నందుగల వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్ధానంనకు చేరుకొనును. అనంతరం అల్పాహారం ఏర్ఫాటుచేయడమైనది.
ఈ కార్యక్రమం నకు ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు, వాసవి మహిళామండలి సభ్యులు, వాసవి దీక్షా సమితి కార్యవర్గ సభ్యులు, వాసవి దీక్షాపరులు, ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు, వాసవి సహాయనిధి కార్యవర్గ సభ్యులు, వాసవి భక్త మండలి సభ్యులు,
వాసవి సామూహిక వివాహ సంస్ధ కార్యవర్గ సభ్యులు, వాసవి నిత్యహోమ సభ్యులు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, అందరూ తప్పక ఈ కార్యక్రమం నకు హాజరు కావాలని కోరుతున్నాము.
Leave a Reply