శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 26వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి.

ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో దేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా వారి ఆలయంలో వైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

ఆదివారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు.

అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జనవరి 20న దేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం –

వైష్ణవ భక్తాగ్రేసరుడు, వేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో ఆదివారం నాడు ఘనంగా జరిగింది.

సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణంగా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని తీసుకువ‌చ్చి ఆల‌య అర్చ‌కులకు అందించారు.

అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు.

For English Click 2

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*