ఆదివారం సూర్యుడిని పూజిస్తే… సకల రోగాలు తొలిగిపోతాయా?

ప్రతీ వారానికి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే మన పెద్దలు, పూర్వీకులు ఏవారంలో ఏమి చేయాలో చాలా స్పష్టంగా చెబుతూవచ్చారు.

అందుకు గల కారణాలను కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, వ్రతాలు, నోములు చేయరు. మనకు ఉన్న ఏడు వారాల్లో కూడా ఒక్కో రోజుకు ఓక్కో ప్రత్యేకత కనిపిస్తుంది.

మనమందరం ఆదివారం రాగానే చాలా విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనుకుంటాం. కానీ, ఆదివారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. ఆదివారం మానవ ఆరోగ్యానికి సంబంధించిన రోజు

ఆదివారం అంటే రవివారం. అంటే సూర్య సంబంధిత వారం. ఈ రోజునకు సూర్యుడు అధిపతి. ఆరోగ్యం భాస్కరాద్ధిచ్ఛేత్‌ అన్నారు పెద్దలు.

అనగా మానవుని ఆరోగ్యానికి సూర్యుడు కారకుడు. మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రోజున వేద పండితులను, ఇతర దేవతలను పూజించాలి.

రవిని పూజించడం వల్ల నేత్రరోగాలు, శిరోబాధలు, కుష్టుబాధలు తగ్గుతాయట. వేద పండితులకు భోజనం పెట్టాలి.

ఇలా ఒక రోజునుంచి ఒక నెల లేదా సంవత్సరం లేదా మూడు సంవత్సరాలు అనారోగ్య తీవ్రతను బట్టి పూజ చేసుకోవడం వల్ల సూర్యానుగ్రహం లభిస్తుందట.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*