
మనం వంటింట్లో ఉండే అల్లం అంత మేలు చేస్తుందా…? నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఘాటుగా ఒట్టిది కొంచెం కొరకాలన్నా భయమేస్తుంది. కానీ, అదే అల్లం మన వంటింటికి చేరింది. ఎందుకు?
మనిషి ఏది తింటే పది కాలాల పాటు జీవిస్తాడో మన పూర్వీకులు చాలా స్పష్టంగా చెప్పారు. అంతే కాదు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మన శాస్త్రాలు చాలా స్పష్టంగా వివరించాయి.
అల్లం నేరుగా తినాలంటే కష్టమే. కానీ, రకరకాలుగా తిన్నా కూడా దాని వలన ఒనగూరే ప్రయోజనాలు అలాగే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లంలో యాంటీ యాక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అల్లంలో జ్ఞాపకశక్తిని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఉదర పేగులో రకరకాల క్రిముల చేరుతుంటాయి. అల్లం తీసుకోవడం వలన అవి నశిస్తాయి. అలాగే ముఖ్యమైన విషయం అల్లం లివర్‌ను శుభ్రపరుస్తుంది.
అల్లం తింటే ఆకలిలే లేదు అని వారు ఆకలితో అల్లాడుతారు. ఇక అల్లం పచ్చడి అంటే మనలో చాలా మంది ఎగిరి గంతేస్తారు. ఇడ్లీ కాంబినేషన్ తో అదిరిందని అంటుంటారు.
దానిని కొత్తిమీర తరుగుతో పచ్చడి తయారుచేసుకుని తీసుకోవడం ఉత్తమం. అంతేనా అంటే కానే కాదు.
ఇది కాస్త కష్టమే అయినా సరే తీసుకోక తప్పదు. గొంతు నొప్పి వచ్చినప్పుడు భరించడం కష్టం. కాని, అల్లం రసం తాగి చూడండి. మంచి ఫలితాన్నిస్తుంది. కానీ అది మొతాదు మించకూడదు సుమా…!
ఇక అల్లం రసాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే వ్యాధులు దరిచేరవు. బరువు తగ్గుతారు కూడా. అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. మనిషిని చురుగ్గా ఉంచుతుంది.
గమనిక : అల్లంపై ఉన్న తొక్కను తీసేయకుండా అలానే దంచ కూడదట. అల్లం తొక్కలో విషపదార్థాలుంటాయట. ఇవి ప్రమాదకరం. అందుకే తొక్కతీసిన అల్లాన్ని మాత్రమే వినియోగించాలి.
Leave a Reply