ఆలయంలో ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవుణ్ణా..! నవగ్రహాలనా… ! చెప్పండి ప్లీజ్

చాలా మందికి కలిగే అనుమానం ఏమిటో తెలుసా… మన వెళ్ళే గుడిలో నవగ్రహాలు ఉంటే ఎవరిని ముందు దర్శించుకోవాలి? దేవతా మూర్తినా? నవగ్రహాలనా?

ఎంతే దేవుని దయన ఉన్నా నవగ్రహాల అనుగ్రహం లేకపోతే ఇక అంతే అనే సంగతి మనకు తెలుసు. ఇలాంటి స్థితిలో మనం ముందుగా ఎవరిని దర్శించుకోవాలి? ఏమంటారు? నా సందేహం సమంజమే కదా?

దేవుడిని దర్శించుకుంటే నవగ్రహాలకు కోపం వస్తుందేమో? నవగ్రహాలను దర్శించుకుంటే దేవుడికి అప్రాధాన్యత కల్పించినట్లే కదా? ఎలా ఏం చేయాలి? చెప్పండి ప్లీజ్.

నాకు చాలా కన్ఫ్యుజన్‌గా ఉంది. ఒక్కసారి మనసులో గిలి చేరితే అది పులి కంటే ప్రమాదం కదా? ఈ మధ్యన గుడికి వెళ్ళినప్పుడు నాక్కూడా ఇదే సందేహం కలిగింది.

అందుకే ఇంటికి వచ్చిన తరువాత అన్నీ తెలిసిన ఓ పెద్దాయనను అడిగాను. ఆయన ఏం చెప్పాడో తెలుసా?

సాధారణంగా ఏ ఆలయంలోకి వెళ్ళినా ఏం చేస్తాం. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకుంటాం. ఆ తరువాత శివుడైతే, శివుడు ఏ దేవత లేదా దేవుడు అయితే ఆ దేవుడిని దర్శించుకుంటాం. ఇది ఆనవాయితీ.

ఎందుకంటే వినాయకుడు తొలిపూజలు అందుకునే అందరికీ ఆమోద యోగ్యమైన దేవుడు కావునా. మరి అదే గుడిలో నవగ్రహాలు ఉంటే ఏం చేయాలి?

ఎక్కువగా శివాలయాలలో నవగ్రహాలు ఉంటాయి. ఇలాంటి ఆలయాల్లో ఎవరిని దర్శించుకోవాలి? శివుడినా? నవగ్రహాలనా? అంటే శాస్త్రాలు ప్రత్యేకించి జోతీష్య శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే…

శివుడిని దర్శించుకున్న తరువాతే నవగ్రహాలను తిరగాలట. అక్కడ కూడా మరో సందేహం కలుగుతుంది.

అక్కడికెళ్ళిన తరువాత ఎవరిని చూడాలి? సూర్యుడినా.. చంద్రుడినా? రాహుకేతువులనా?

అందుకు కూడా మరో మాట చెప్పారు. సూర్యుడిని చూస్తూ చంద్రుని వైపు నుంచి 9 ప్రదిక్షాణాలు చేయాలి. ఇది ఉత్తమమైన పద్దతి.

నవగ్రహాల చుట్టూ ఎప్పుడు తిరగాలి. సాధారణంగా దేవుడిని ఎప్పుడు దర్శించుకున్నా ఏమి అనుకోడు. కాకపోతే, పుణ్యం భాగంతో కాస్తంత తగ్గుతుంది.

కానీ, నవగ్రహాలను ఎప్పుడుపడితే అప్పుడు ఎలా పడితే అలా తిరగడానికి లేదట. శుచిగా, స్నానం చేసి పరిశుద్ధమైన దుస్తులు ధరించి చేయాలి.

నవగ్రహాలను తిరిగే సమయంలో కింది మంత్రాలను పఠించాలి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవ్ నమః!!

ఆదిదేవ! సమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!
దివాకర! సమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే….
సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మధరందేవంతంసూర్యం ప్రణమామ్యహమ్!

అసురులైన రాహుకేతవులకు అప్రదిక్షిణంగా రెండు ప్రదక్షిణలు చేస్తే మంచిది అంటారు. అలా చేస్తే వారి నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురుకావట.

ఒక్కొక్క గ్రహం పేరును మననం చేసుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. వాటిని చేతితో తాక రాదు. దూరం నుంచే ప్రదక్షిణలు చేయాలి.

సాధారణంగా నవగ్రహాల పేరు చెపితేనే చాలా మంది జంకుతారు. అందుకనే దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళుతుంటారు. అయితే జీవిత స్థితిగతులను మార్చేది నవగ్రహాలే.

నవగ్రహాలను నిష్టగా నియమాలతో ప్రదిక్షణ చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

పద్దతిని అతిక్రమించే చేసే ప్రదిక్షణల వలన అంతగా ఫలితం ఉండదు. అందుకే నవగ్రహాలను తిరిగేటప్పడు జాగ్రత్త వహించాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*