జ‌న‌వ‌రి 21,22 మరియు 28, 29న ప్రత్యేక దర్శనం వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే

శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది.

ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.

ఇందులోభాగంగా జ‌న‌వ‌రి 21, 28వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది.

ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.

ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు.

కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.

5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను జ‌న‌వ‌రి 22, 29వ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి  సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*