త్వరలో కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు… ప్లాన్ చేసుకోండి

శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానున్నాయి. వెంకన్న బ్రహ్మోత్సవాలు చూడాలనుకుంటే ప్లాన్ చేసుకోండి.

ఎక్కడ హైరానా అక్కరలేదు. పిబ్రవరి 22వ తేదీ వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.00 అంకురార్పణ జరుగుతుంది.

కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల కింది విధంగా ఉంటాయి. :

తేదీ                   ఉదయం సాయంత్రం

14-02-2020(శుక్ర‌వారం)          ధ్వజారోహణం                         పెద్దశేష వాహనం

15-02-2020(శ‌నివారం)            చిన్నశేష వాహనం                   హంస వాహనం

16-02-2020(ఆదివారం)          సింహ వాహనం                         ముత్యపుపందిరి వాహనం

17-02-2020(సోమ‌వారం)         కల్పవృక్ష వాహనం               సర్వభూపాల వాహనం

18-02-2020(మంగ‌ళ‌వారం)      పల్లకి ఉత్సవం(మోహినీ)   గరుడ వాహనం

19-02-2020(బుధ‌వారం)        హనుమంత వాహనం            స్వర్ణరథం, గజ వాహనం

20-02-2020(గురువారం)          సూర్యప్రభ వాహనం             చంద్రప్రభ వాహనం

21-02-2020(శుక్ర‌ వారం)         రథోత్సవం                             అశ్వవాహనం

22-02-2020(శ‌నివారం)            చక్రస్నానం                        ధ్వజావరోహణం

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*