పూజకు వాడే పువ్వును కడిగితే పనికిరాదా? మరి ఎలాంటి పువ్వులను వాడాలి?

పూలు సమర్పించని పూజ అసంపూర్తిగానే నిలుస్తుంది. అందుకే దేవాలయానికి వెళ్లేటప్పుడు పూలు తీసుకెళ్ళడం సహజం.

కానీ, భగవంతునికి పువ్వులు సమర్పించాలని ఎక్కడ చెప్పబడి ఉంది అంటే ఏమో తెలియదు. పెద్దలు చెబుతున్నారు. మేము అదే వినియోగిస్తున్నామని చెబుుతారు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలోనే పూజలో పువ్వుల ప్రస్తావన తీసుకు వచ్చారు. పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పించాలని అన్నారు.

అప్పుడే ఆ భక్తి ఫలప్రదం అవుతుందని అన్నారు. సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే పూజలో పువ్వుల ప్రాధాన్యత ఎంతటిదో చెప్పాల్సిన అవసరం లేదు.

అవి ఎలాంటి పుష్పాలై ఉండాలి. ఆ పుష్పాలను ఎలా వినియోగించాలి? అనే అంశంపై కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి.

దేవునికి సమర్పించే ఏ పుష్పానికైనా పవిత్ర ఉండాలి. అందుకు కొన్ని నియమాలున్నాయి. మైలపడ్డ మహిళలు, బహిష్టులైన స్త్రీలు తానికి పూలు పూజకు పనికిరావు.

అంతే కాదు. కోసి పూలు కిందపడినా, కడిగిన పూలు, చివరకు వాసన చూసిన పుష్పాలు కూడా పూజకు పనికి రావాని శాస్త్రం చెబుతోంది.

స్నానమాచరించి కోసిన పత్ర, పుష్పాలనే మాత్రమే పూజకు వినియోగించాలి. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన వినియోగించరాదు. వాటిని అపవిత్రమైనవిగానే భావించాలి.

ఇక్కడ మళ్ళీ పూజకు అన్ని పుష్పాలు కూడా పనికిరావు. కొన్నింటిని మాత్రమే పూజకు వినియోగిస్తారు.

తామర , కలువ, జాజులు, చామంతి, నందివర్ధన, మందార, పారిజాతాలు, గరుడవర్ధనాలు మొదలైన పూలు పూజలకు పవిత్రమైనవిగా అంటారు.

సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజలంటే చాలా ఇష్టం. విష్ణుభగవానుడిని తులసి దళాలతో, లక్ష్మిదేవికి తామర పువ్వులంటే ఇష్టం. మహాశివుని మారేడు దళాలతో పూజించాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*