ప్రసన్నవెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన ప్రసన్న వెంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం ఆవిష్క‌రించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వనంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ వరకు శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు.

ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 25వ‌ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు.

పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మ‌ వార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                    ఉదయం                   రాత్రి

26-01-2020(ఆదివారం)   ధ్వజారోహణం           పల్లకీ ఉత్సవం

27-01-2020(సోమ‌వారం)  పెద్దశేషవాహనం         హంసవాహనం

28-01-2020(మంగ‌ళ‌వారం)  ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

29-01-2020(బుధ‌వారం)   కల్పవృక్ష వాహనం        హనుమంత వాహనం

30-02-2020(గురువారం)   సూర్యప్రభ వాహనం        చంద్రప్రభ వాహనం

31-02-2020(శుక్ర‌వారం)   సర్వభూపాల వాహనం       కల్యాణోత్సవం, గరుడవాహనం

01-02-2020(శ‌నివారం)    రథోత్సవం                         గజ వాహనం

02-02-2020(ఆదివారం)     పల్లకీ ఉత్సవం                 అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం)   చక్రస్నానం,                         ధ్వజావరోహణం

కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ శుక్ర‌వారం ఆలయంలో కల్యాణోత్సవం రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.

రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఫిబ్రవరి 4వ తేదీ మంగ‌ళ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఘనంగా జరుగనుంది.

ఉత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సాయి చైత‌న్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*