మూలస్థాన ఎల్లమ్మ కు టిటిడి తరఫున సారే సమర్పించిన చెవిరెడ్డి

చంద్ర‌గిరిలోని మూల‌స్థాన ఎల్ల‌మ్మ‌కు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం టిటిడి తరఫున టిటిడి బోర్డు ఎక్స్ ఆఫిషియో స‌భ్యులు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె సమర్పించారు.

అంత‌కుముందు తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం నుండి వ‌చ్చిన‌ సారెను చంద్ర‌గిరిలోని శ్రీ కోదండ‌రామ‌ స్వామి వారి ఆల‌యంకు తీసుకువ‌చ్చి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను  మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మ‌ వారికి స‌మ‌ర్పించారు.

ఈ సందర్భంగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ  ప్రతి ఏటా సంక్రాంతి మ‌హోత్స‌వాల‌లో భాగంగా అమ్మవారికి టిటిడి సారెసమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఇందులో భాగంగా శుక్ర‌వారం టిటిడి త‌ర‌పున అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ‌వారి ఆల‌య పేష్క‌ర్ లోక‌నాథం, చంద్ర‌గిరి మూల‌స్థాన ఎల్ల‌మ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షులు శివ‌శంక‌ర్‌రెడ్డి, ఆల‌య ఈవో రామ‌కృష్ణా రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*