కడపలో వెంకన్న బ్రహ్మోత్సవాలు..10 రోజుల్లో చూసి తరించండి

టిటిడికి అనుబంధంగా ఉన్న వై.య‌స్‌.ఆర్‌.క‌డ‌ప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ శుక్ర‌వారం సాయంత్రం ఆవిష్క‌రించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వనంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.
ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ వరకు శ్రీ ప్రసన్నవెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు.

ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 25వ‌ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌ం అవుతాయ‌న్నారు.

పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మ‌ వార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                 ఉదయం              రాత్రి

26-01-2020(ఆదివారం)     ధ్వజారోహణం           చంద్రప్రభ వాహనం

27-01-2020(సోమవారం)      సూర్యప్రభవాహనం      పెద్దశేష వాహనం

28-01-2020(మంగళవారం)   చిన్నశేష వాహనం     సింహ వాహనం

29-01-2020(బుధవారం)        కల్పవృక్ష వాహనం       హనుమంత వాహనం

30-01-2020(గురువారం)   ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

31-01-2020(శుక్రవారం)          కల్యాణోత్సవం          గజవాహనం

01-02-2020(శనివారం)            రథోత్సవం       ధూళి ఉత్సవం

02-02-2020(ఆదివారం)       సర్వభూపాల వాహనం     అశ్వ వాహనం

03-02-2020(సోమ‌వారం)     వసంతోత్సవం, చక్రస్నానం     హంసవాహనం, ధ్వజావరోహణం

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*