వేంకటేశ్వర స్వామి వేటాడడం ఎప్పడైనా చూశారా ?(వీడియో)

తిరుమలలో వెంకటేశ్వర స్వామి వేటాడడం ఎప్పుడైనా చూసారా…

అది ఓ ఉత్సవంలా జరగడం మీకు తెలుసా. తెలియకపోతే మీరు వార్త చదవాల్సిందే.

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ గురు వారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది.

గురువారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తి అయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంటనే మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు.

అనంతరం పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహవచనం జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు.

శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు జరిగాయి.

అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు, స్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.

శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్ప స్వామివారి సన్నిధికి వెళ్ళారు.

తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్ప స్వామి వారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది.

తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు.

ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు.

శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహా ద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు.

ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

[embedyt] https://www.youtube.com/watch?v=wGppXV-VZcg[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*