వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి ? అంటే…

జీవితంలో ప్రతి మనిషికి తప్పనిసరిగా ఉండే ఒకే ఒక కోరిక ఇల్లు కట్టుకోవడం. కూడుకంటే గూడే ముఖ్యమైనది అవుతుంది.

అందుకే జనం తమ కలల సౌధాన్ని తమ ఇష్టానికి అనుగుణంగా కట్టుకోవాలని చూస్తారు. అందులో ఎక్కడ రాజీ పడకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు.

అలాంటి ఇల్లు నిర్మించుకునే సమయంలో ఉండాల్సిన విధానం ఏంటి? ఆ ఆంటికి సాలు,మూల అదేనండి వాస్తు చూస్తారు. వాస్తనదేం కొత్త అంశం కాదు. చాలా పాతది.

వాస్తు అంటే ఇంటికి గాలి వెలుతురు పది కాలల పాటు నిలిచే విధంగా ఉండే నివాసయోగ్యమైన భవన నిర్మాణ విధానం.

మానసిక ప్రశాంతత కావాలంటే వాస్తును చూడడం చాలా ముఖ్యం. ఇక్కడ ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తొస్తాయి.

కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి నిర్మాణం కోసం ముందుగా స్థల ఎంపిక కూడా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉంటుంది.

స్థల ఎంపిక సాధ్యమైనంత వరకూ తూర్పు, ఉత్తర ముఖం ఉండేలా చూసుకుంటారు. కారణమేదైనా ఎక్కువ మంది ఇష్టపడేది ఈ ముఖాలే.

కొందరు వారి జన్మనక్షత్రాన్ని అనుసరించి పడమర దక్షిణ ముఖాలను కూడా ఎన్నుకుంటారు. అదే వేరే విషయం.

స్థల ఎంపిక జరుగగానే ఇంటి నిర్మాణానికి ఈశాన్య భాగంలో పునాదిని తవ్వాలి. ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయి.

అనంతరం నైరుతి దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్ర ప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇల్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని వాస్తునిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంటికి ప్రహారి రక్షణ వలయంలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే కోట గోడలాంటిదని చెప్పాలి.

ఇంటి స్థలానికి తూర్పు భాగంలో ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ స్థలం కూడా పడమరకంటే ఎక్కువగా ఉండాలి. అదే విధంగా ఉత్తరం దిక్కున ఖాళీ ఉండాలి. అది కూడా దక్షిణ దిక్కు కంటే ఎక్కువ ఉండాలి.

ప్రతి ఇంటికి ఇవి ప్రాథమిక వాస్తు సూత్రాలు, ఇంటికైనా ఇంటి ప్రహారీకైనా ఈశాన్యంలో కనిపించీ కనిపించనంతైనా మూలు పెరిగి ఉండాలి. ఈ భాగంలో పశువుల పాక, ధాన్యం నిల్వ చేసే గదుల నిర్మాణం లాభదాయకం.

కాకపోతే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పుఈశాన్య మూలకి వాలి ఉండాలి. లేదంటే స్త్రీలలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అంటారు.

కానీ, బావి అదే దిశలో తవ్వి ఉంటాము కనుక పైన పడ్డ వర్షం నీరు ఆ బావికి చేరాలనే శాస్త్రీయత ఇందులో ఇమిడి ఉంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*