ఇంటి ముందు ముగ్గు వేస్తే.. లక్ష్మిదేవి ఇంట్లోనే ఉంటుందా? భూతాలను కట్టేయవచ్చా?..

రథాల ముగ్గు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగుల ముగ్గులు ఇలా ఎన్నో ముగ్గులు ఉన్నాయి. ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి.

ముగ్గుల కోసం అమ్మాయిలు అదే పనిగా పుస్తకాలు ముందు వేసుకుని సాధన చేస్తుంటారు. కానీ, ఆ ముగ్గులు ఎందుకు వేస్తారో.. ఏ ముగ్గు ఎప్పుడు వేయాలో తెలియదు.

కానీ, ముగ్గులు వేయడానికి, సమయం సందర్భం, స్థలం ఉందంటే ఆశ్చర్యం కలుగుుతంది.

అందునా ముగ్గులతోనే అటు దేవతలను ఇటు భూత ప్రేతాలను కట్టివేయడమే కాకుండా లక్ష్మిదేవిని ఇంట్లోంచి బయట వెళ్ళకుండా చేయవచ్చట.

ఇల్లు, గడప ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా కట్టడి చేస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

అందుకేనేమో మంత్రగాళ్లు ముగ్గులు పోసి అడ్డగిర్రలు వేస్తారు. ముగ్గు పోసిన తరువాతే మంత్రాలు చదవడం మొదలు పెడతారు.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని అర్థం.

పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతను పూజ చేసే సమయంలో పీఠ వేసి ముగ్గు వేస్తారు. నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

పెళ్ళిళ్ళలో నలుగులు పెట్టే సమయంలో ఇలాగే చేస్తారు. ఇది మంగళకరమైన సమయమని అర్థం.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. చాలా సినిమాలలో మంత్రగాళ్లు వేసే ముగ్గులు ఇలానే ఉంటాయి.

అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి.
అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా.

యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కవద్దని పదే పదే పెద్దలు చెబుతారు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం ముగ్గు పోసి దీపారధన చేయాలి. ఇది దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిళ్లంతా ముగ్గులు పెట్టకూడదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

[rl_gallery id=”2908″]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*