కేరళలో మకరవిళక్కు దర్శనం పులకించిన అయ్యప్పలు

మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకరవిళక్కు దర్శనమిచ్చింది. అదే సమయంలో మకర జ్యోతి వెలిగింది.

ప్రతి ఏడు  మకర సంక్రాంతి నాడు  సాయంత్రం  కాగానే పొన్నంబలమేడు కొండల్లో పెద్ద వెలుగు  దర్శనమిచ్చి  వెళ్లిపోతుంది.

ఈ ఏడాది ఆ వెలుగు బుధవారం సాయంత్రం కనిపించింది.
దీనినే మలయాళంలో మకరవిళక్కు అని  తెలుగులో  జ్యోతి అని అంటారు.

అదే సమయంలో ఆకాశంలో ఒక ఒక తార కనిపిస్తుంది. వెలుగుతుంది.

జ్యోతి దర్శనం కోసం ప్రతి ఏడాది మాదిరిగానే భారీ సంఖ్యలో భక్తులు  శబరిమలకు చేరుకున్నారు.

కొన్ని వేలమంది అయ్యప్ప భక్తులు  శబరిమలై కు చేరుకున్నారు. వారితో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

మకర జ్యోతి దర్శనం కాగానే.. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల సన్నిధానం మార్మోగింది.

సాయంత్రం 6.45 గంటల సమయంలో మకర జ్యోతి దర్శనం ఇచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్థానం ప్రకటించింది.

అయ్యప్ప భక్తులు జ్యోతిని వీక్షించేందుకు పంబ, నీలికల్‌, పులిమేడ్‌ ప్రాంతాల్లో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది.

ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పోలీసులను కూడా భారీ ఎత్తున మోహరించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*