తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -30

పాశురము-30

వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్

శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం

తెలుగు అర్థం

ఆండాళ్ తల్లి భక్తికి మెచ్చి, శ్రీరంగములో కొలువై వున్న ఆ వైకుంఠనాథుడు శ్రీరంగనాథుడే స్వయముగా పల్లకీని పంపి, ఆమెను వివాహమాడెను. తనతో పాటు ప్రతీ దేవాలయములోను ప్రతిష్ట చేసెను.

అందుకే ఈ 30వ పాశురములో ఫలశ్రుతిగా, ఈ తిరుప్పావై వ్రతమును ఆచరించినా లేక ఈ 30 పాశురములను మనస్ఫూర్తిగా చదివినా కలిగే ఫలితమును గురించి తెలిపారు.

కూర్మావతార సమయమున మందర పర్వతముతో, వాసుకీ అనే పామును త్రాడుగా చేసుకొని, దేవతలు రాక్షసులు అలలతో నిండియున్న పాలసముద్రమును చిలికినప్పుడు,

అమృతముతో పాటు ఉద్భవించిన లక్ష్మీదేవిని పొందిన మాధవుడు, బ్రహ్మరుద్రులను సృష్టించిన సర్వేశ్వరుడు, రేపల్లెలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, వివిధ

ఆభరణములను ధరించిన చంద్రముఖులైన గోపికలు, తమ సర్వస్వమూ ఆ శ్రీకృష్ణుడే అని ఆ స్వామిని సేవించి, ఆ స్వామికి శుభము కలగాలి అని మంగళమును పాడి, పరతత్వము, పరమపదము అయిన ఆ వైకుంఠమునకు వెళ్లు

మార్గమును చూపు పర అనే వాయిద్యమును ఈ లోకములోని ప్రజలందరి కొరకు మరియు తమ కొరకు అడిగి, ఆ భగవంతుడి యొక్క సేవాభాగ్యమును పొందిరి.

ఇప్పుడు అదే విధముగా, విల్లిపుత్తూరు నగరములో, తామర పూసల మాలను మెడలో ధరించిన భట్టనాథుడు అను పెరియాళ్వారుడి కూతురు అయిన ఆండాళ్ తల్లి మన గోదాదేవి అంధ్రప్రదేశ్,

తమిళనాడు రాష్ట్రములు కలిసి వున్నప్పటి భాష అయిన ద్రవిడ భాషలో ముప్పై పాశురములను మాలగా కట్టి, ఆ పాశురమాలను ప్రజలకు ఇచ్చి, తన సర్వస్వమూ తానే అనుకున్న ఆ సర్వేశ్వరుడిని వివాహమాడెను.

ఎవరు ఈ ముప్పై పాశురములను క్రమము తప్పకుండా, ప్రతీ సంవత్సరము మార్గశిర మాసమున పండు వెన్నెలల యందు వచ్చే ధనుర్మాసమున వ్రతముగా చేస్తారో, వారు తప్పకుండా, ఆనాడు గోపికలు, ఈనాడు ఆండాళ్ తల్లి పొందిన ఫలితమునే పొందెదరు.

అంతే కాకుండా వ్రతములా చెయ్యలేనివారు, మనస్ఫూర్తిగా చదివినచో వారికి ఆ పుండరీకాక్షుడు, పర్వత శిఖరముల వంటి చేతులు కలిగిన శ్రీవల్లభుడు, చతుర్భుజుడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు ఎల్లవేళలా వారికి ఆనందమును, సుఖసంతోషములను ప్రసాదించును.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*