గుడిలో గంటెందుకు కొట్టాలి?

మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే పై కప్పు నుంచి కింది వరకూ వేలాడదీసిన ఓ గంట స్వామి ఎదురుగా దర్శనం కనిపిస్తుంది.

ఆ గంట మోగించిగానీ, మనం దైవదర్శనం చేసుకోం. మనం వస్తున్నామని పూజారికి చెప్పడానికా? లేక దేవుడికి చెప్పాడానికా?

అంతెందుకు మనం ఇంట్లో పూజ చేస్తున్నా కూడా గంటరావం చేస్తాం. హారతి ఇచ్చే సమయంలో కూడా గంట మోగిస్తాం. ఎందుకు మోగించాలి? దాని అర్థం పరమార్థం ఏంటి?

మనము చేసే నిత్య పూజ ఆరంభములో కింది విధంగా చెపుతూ గంటను వాయిస్తాము.

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం

దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీపరమయిన శక్తులు నాలో ప్రవేశించి అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక! అని అర్థం

గంట మ్రోగించడం ద్వారా వచ్చే శబ్దము మంగళకరమైన ధ్వని. ఇది ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది.

సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం.

హారతిచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది.

ఎంతటి కార్యక్రమమైన పది మంది కలిసిన చోట మంచి చెడు మాట్లాడుకోవం సహజం. ఇలాంటి ఎవరిపాటికి వారు ఉంటే వచ్చిన కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం నెరవేరదు.

అందుకే పూజా కార్యక్రమానికి ముందుగా ఒక్క సారి గంట మోగిస్తారు. ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి.

తద్వారా చేసిన పూజ యొక్క ఫలితం దక్కుతుందని భావిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*