తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -29

పాశురము-29

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

తెలుగు అర్థం

స్వామీ, మేము సుకుమారులము, పైగా చిన్నపిల్లలము. అయినా ఇంత చలిలో, చాలా చీకటిలో, ఎంత కష్టమైన వచ్చి, నిన్ను సేవించాము.

నీవు వైకుంఠము నుండి గోకులానికి ఒక్క జన్మకు మాత్రమే వచ్చావు. కాని మేము నిన్ను జన్మ జన్మలకూ సేవించాలని నీ సన్నిధికి వచ్చాము.

నీవు వైకుంఠములో వున్నంతవరకూ జన్మ లేనివాడవు. అక్కడ నీకు అనంతుడు, గరుత్మంతుడు మొదలైనవారు ఎంతోమంది సేవలు చేస్తారు.

కాని ఇప్పుడు జన్మలు లేని నువ్వు, గోకులములో పుట్టావు. అందుకే నీకు సేవలు చెయ్యాలని మేము వచ్చాము.

మేము మా బంధువుల నందరిని వదిలిపెట్టి, పెద్దలు పెట్టిన నియమ నిబంధనలను, కట్టబాట్లను సడలించుకుంటూ, నీ సేవచేస్తూ, నిన్నే పొందాలని వచ్చిన మా ఆర్తిని చూసి, మాపై దయతో నీవు కరిగిపోవాలి.

మమ్మల్ని పిలిచి నీవు ఆజ్ఞాపించి, మా చేత నీకు దగ్గరగా వుండే నీ అంతరంగ సేవలు అయిన ప్రసాదపాత్రను తీసుకొని రావడం, హారతిని ఇవ్వడము, ఉత్తరీయమును అందించడము,

గాలి కొరకు వింజామరను వీచడం, తాంబూలము అందించడము మొదలగు ఏకాంత సేవలను మా చేత చేయించుకోవాలి, అని గోపికలు అడగగా, శ్రీకృష్ణుడు,

అలాగే మీకు నచ్చిన సేవలు చేద్దురు కాని, ముందు మీరు అడిగిన పర అనే వాయిద్యమును తీసుకోండి ఇదిగో.

వెంటనే గోపికలు, మా వాళ్లందరిని వదిలిపెట్టి, నిన్ను చేరాలని సంకల్పించిన మా మీద, ఎవరికీ అనుమానము, సందేహము రాకుండా, వారెవరూ మాకు అడ్డుపడకుండా మాత్రమే మేము ఆ వాయిద్యమును అడిగాము.

అంతేకాదు, అప్పుడు నీ మీద భక్తితో మా హృదయములోని భావాన్ని మేము సూటిగా వివరించలేక పోయాము.

కాని ఇప్పుడు చెబుతున్నాము. ఏనాటికి మేము నీతోనే వుండిపోవాలి. నీవు ఎక్కడ వుంటే, మేము అక్కడే సేవలు చెయ్యాలి.

నీకు మెలుకువలోను, నిద్రలోను సర్వసేవలని చేసే లక్ష్మణుడి వలె మేము ఎల్లప్పుడు నీ చెంతనే వుండిపోవాలి, అని ఆండాళ్ తల్లి తన పాల వంటి స్వచ్ఛమైన మనస్సును ఆ భగవంతుడి పాదములపై పెట్టి, ఆ భగవంతుడిపై వున్న భక్తి

అనే వెన్నను చిలికి, తను ఆస్వాదించి ఆనందించి, ఆ ఆనందమును మనను కూడా అనుభవించమని చెప్పినది. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*