ఎస్‌వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా… ఎందుకు?

శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌కు ఛైర్మన్  పదవికి సినీనటుడు పృధ్వీ రాజీనామా చేశారు.  మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్న ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు.

దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. రాజీనామాకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్ళితే,

ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్  అసభ్యంగా మాట్లాడినట్టుగా  సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది.

ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పృథ్వీ అప్పటికే రైతుల వ్యవహారంలోనూ వివాదస్పదంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

హైకమాండ్ ఆదేశాలతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పృథ్వీ ప్రకటించారు.

ఈ పరిణామాలపై పృథ్వీరాజ్  ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*