తిరుపతిలో ఘనంగా ముగిసిన ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవాలు సోమ‌వారం ఘనంగా ముగిశాయి. జనవరి 7 నుండి ఆండాళ్‌ అమ్మవారికి నీరాటోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై గోవిందరాజస్వామివారి ఆలయం నుండి రామచంద్ర తీర్థ క‌ట్ట‌కు ఊరేగింపుగా చేరుకున్నారు.

అక్కడున్న మండ‌పంలో అమ్మ‌వారిని కొలువుతీర్చి వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు.

సాయంత్రం 4 గంటలకు ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు.

భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో ‌మ‌తి వరలక్ష్మి, ఏఇఓ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్‌, శర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు కృష్ణమూర్తి, ‌ మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*