గోవిందా… గోవిందా… శ్రీవారి చేతిలో చిలుక ఎగిరిపోయింది..?

తిరుమల శ్రీవారి ఆలయంలోని చిలుక ఒకటి ఎగిరిపోయింది. ఎగిరి ఎగిరి ఓ అధికారి సాయం తీసుకుని అలిపిరి సమీపంలో ఓ స్వామిజీ చేతికి మారింది.

ఏనాడు ఆలయం దాటికి బయటకు రాని ఆ చిలుక ఎలా తిరుమల కొండ దిగింది? కొండ దిగిన చిలుక స్వామిజీ చేతికే ఎందుకు చిక్కిందనేది పెద్ద ప్రశ్న. ఈ సంఘటన జరిగి రోజులు గడిచినా చర్చ సాగుతూనే ఉంది.

చిలుక ఎగిరిపోతుంటే ఆగమాలు, ఆగమ సలహాదారులు, అధికారులు ఏం చేస్తున్నారు? అనేది పెద్ద ప్రశ్న. టీటీడీ పరిధిలో ఇది పెద్ద ప్రశ్నగా మారుతోంది. వివరాలిలా ఉన్నాయి.

తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసంలో జరిగే తిరుప్పావై పాశురాల సందర్భంగా మూల విరాట్‌కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా ధనుర్మాస చిలకను అలంకరిస్తారు.

పవిత్ర ఆకులతో తయారుచేసిన ఈ ధనుర్మాస చిలకను సాధారణంగా తిరుమల ఆలయం దాటికి బయటకు రాదు. బయటకు తెచ్చే వీలు లేదు.

ఆగమ శాస్త్రంతో బాటు ఆలయాల చట్టంలో శ్రీవారికి అలంకారం చేసిన పూలమాలలను బయటకు ఇవ్వకూడదు. పూల మాలే కాదు ఏదీ బయటకు రాకూడదు.

కానీ, అధికారులు శారదాపీఠాధిపతి స్వరూపా నందేంద్ర స్వామిజీకి స్వాగతం పలుకడానికి తిరుమల కొండదిగి అలిపిరికి పరుగులు పెట్టారు.

వారు రావడమే కాదు. వారు పిలిచిన వెంటనే స్వామి శంఖంపై ఉన్న చిలుక ఎగురుకుంటూ కొండ దిగి స్వామిజీ చేతిలో ఒదిగిపోయింది.

కథంతా ఇప్పటికే అర్థం అయి ఉంటుందని అనుకుంటా.. !

స్వాగతం పలికే తీరు

అక్కడి అధికారులు తలుచుకుంటే ఏదైనా కొండదిగాల్సిందేననే తీరులో వ్యవహారం నడుస్తోంది. శ్రీవారికి అలంకారంగా ఉన్న చిలక బయలకు ఎలా వచ్చిందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అక్కడున్న అధికారి ప్రమేయంతోనే కొండదిగినట్లుంది. రానురాను అర్చకుల ఆచారాలను కూడా పక్కనపెట్టి అధికారులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనడంలో అనుమానం లేదు.

ఎంతటి స్వామిజీ వచ్చిన ఆలయం ఎదుట స్వాగతం పలుకుతారు. ఇంకా పెద్ద స్వామి అయితే ఇఫ్తికఫాల్ స్వాగతం పలుకుతారు.

కానీ, ఏకంగా తిరుమల కొండ దిగి అలిపిరిలోనో, విమానాశ్రయాలలో, రైల్వే స్టేషన్లలో స్వాగతం పలికే కొత్త సాంప్రదాయానికి తెరతీయడం విస్మయాన్ని కలిగిస్తోంది.

అదే విరుద్దమనుకుంటే ఏకంగా స్వామి చేతిలోని చిలుకలను తీసుకువచ్చి స్వాగతం పలుకడం విడ్డూరంగా తోస్తోంది.

ఈ మధ్యలో తన శాస్త్రంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులకు ముహూర్తాలు పెట్టిన పలుకుబడిన కలిగి స్వామిజీ కావడంతో ఇలా చేసినట్లుంది. ఏకంగా శంఖు, చక్రాలను కూడా తీసుకువస్తారేమో… గోవిందా గోవిందా..

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*