భక్తులకు అందుబాటులో టిటిడి క్యాలెండర్లు, డైరీలు

టిటిడి ముద్రించిన 2020వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలు తిరుమ‌ల‌, తిరుప‌తిలో భక్తులకు తగినన్ని అందుబాటులో ఉన్నాయి.

12 పేజీల క్యాలెండర్‌, పెద్ద డైరీ, చిన్న డైరీ, టేబుల్ టాప్ క్యాలెండ‌ర్‌, శ్రీ వేంకటేశ్వర స్వామివారి పెద్ద క్యాలెండర్‌, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్‌, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు కలిసి ఉన్న క్యాలెండర్‌, తెలుగు పంచాంగం క్యాలెండర్లను టిటిడి ముద్రించింది.

తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా, లేపాక్షి స‌ర్కిల్‌, అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలల్లో, తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం,

రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, క‌పిల‌తీర్థం రోడ్‌, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు విరివిగా అందుబాటులో ఉన్నాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*