శ్రీవారి పోటుకు యజమాని ఎవరు? వకుళ మాతా? కాదా?

ప్రతీ రోజు 50 వేల మందికి భోజనాలు, అల్ఫాహారాలు, పాలు, మజ్జిగ వితరణ చేసే పెద్ద వ్యవస్థ అది. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది నిత్యం పని చేస్తుంటారు.

ఒక ఆధ్యాత్మికం కేంద్రంలో అలాంటి వంటశాల ఎక్కడైనా ఉందంటే అది కేవలం తిరుమలకు మాత్రమే సొంతం. అంత పెద్ద పోటు(వంటశాల)కు యజమాని ఎవరు?

అవును కదా? ఎవరు? కొంచెం తెలిసిన వారైతే టపీమని శ్రీ వేంకటేశ్వర స్వామి అమ్మవారైన వకుళమాత అని చెప్పేస్తారు. నిజమేనా? ఆమె ఈ పోటుకు యజమానురాలా? అంటే..

అదేంటి? టిటిడి ప్రకటించింది కదా? అన్ని వంటశాలలో ఆమె ఫోటో పెట్టారు కదా అనేస్తారు. కానీ, ఆమె యజమానురాలని ఎక్కడ ఉంది? ఏ శాస్త్రంలో ఉంది అని అంటే.. చెప్పడం కష్టమే.

శ్రీవారి కోసం తయారయ్యే ప్రసాదాలను వేంకటేశ్వర స్వామి తల్లిగారైన వకుళమాత దేవి చూస్తారని చాలా కాలంగా చెబుతున్నారు.

కానీ, శాస్త్రాల ప్రకారం అలా కనిపించదు. వివరాలను మనం పరిశీలిస్తే, వేంకటేశ్వర స్వామి వారికి ఇరువురు భార్యలు అంటారు. వాస్తవానికి లక్ష్మిదేవి ఒక్కటే భార్య ఆ విషయం మనం ఇదివరకే చెప్పుకున్నాం.

సరే ఆయనకు ఇద్దరు భార్యలే అనుకుందాం. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఆలయంలో రెండు బావులు ఉన్నాయి. ఒకటి పూల బావి రెండవది, బంగారు బావి.

అదే విధంగా వేంకటేశ్వర స్వామి నైవేద్యాల కోసం రెండు పోటులు ఉన్నాయని పురాణాలలో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులో ఒకటి వైకుంఠ ప్రాకారం వద్దనున్న బావి.

జయవిజయల వద్ద బయటకు వచ్చిన తరువాత మనం తీర్థం తీసుకోవడానికి కుడివైపు తిరుగుతాం. కానీ, దానికి ఎడమవైపున ఒకపోటు ఉంటుంది. ఇక్కడ ఉన్న బావిని బంగారు బావి అంటాం.

దీనికి శ్రీదేవి అభిమానదేవత. అంటే యజమానురాలని పురాణాలు చెబుతున్నాయి.

ఆలయంలోనే సంపంగి ప్రాకారం దాటిన తరువాత పూల బావి ఉంటుంది అక్కడ మరో పోటు ఉంటుంది.

అక్కడే భూదేవి అభిమాన దేవతగా ఉంటుంది. ఇది పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది.

మరి వకుళమాత దేవి ఎక్కడ నుంచి వచ్చింది. అక్కడ ఉన్న విగ్రహం ఎవరిది? అనేవి చిక్కుప్రశ్నలే. అయితే కథనాల ప్రకారం, వేంకటేశ్వర స్వామి పెళ్ళి కాక ముందు వకుళమాత భోజనం చేసి పెట్టేదట.

ఆమె యశోధా దేవి అని అంటుంటారు. ఆమెను వరహాస్వామి కొండకు తీసుకువచ్చారనే కథనాలున్నాయి.

ఈ కథనాలకు అనుగుణంగానే అక్కడ ఉన్న విగ్రహాన్ని వకుళమాత విగ్రహంగా భావించి ఆమెను శ్రీవారి పోటుకు యజమానురాలుగా చేశారు.

అయితే పురాణాలలో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు. కేవలం శ్రీదేవి, భూదేవి, పూలబావి, బంగారు బావి, రెండు పోటుల విషయం మాత్రమే ఉంది. వాటికి శ్రీదేవి, భూదేవిలు అభిమాన దేవతలుగా ప్రస్తావించబడి ఉంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*