తిరుమల లడ్డూల తయారీ చూస్తారా…! ( వీడియో )

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. తిరుమలకు వచ్చిన ఎవరైనా లడ్డూ తినకుండా కొండ దిగరు.

తిరుమల లడ్డుకు పెద్ద చరిత్రే ఉంది. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు.

14 శతాబ్ధం నుంచి అన్న ప్రసాదాలు వడలూ ఎక్కువ తయారు చేసేవారు.

అయితే అవన్నీ కూడా త్వరగా చెడిపోతుండడంతో దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది.

అది గుర్తించి తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది.

నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర.

ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.

15వ శతాబ్ధం వరకూ రకరకాల ప్రసాదాలు ఉన్నా, 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపిబూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది.

క్రమేపీ వడ స్థానాన్ని లడ్డు సంపాదించుకుంది, ఇప్పుడు లడ్డుకు డిమాండ్ ఎంతో ఉంది. ‘తిరుపతి లడ్డు’కు భౌగోళిక కాపీరైట్ (పేటెంట్) హక్కు లభించింది.

లడ్డూ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలంటే మొదట అందులో ఏమేమి వినియోగిస్తారో తెలుసుకోవాలి.

స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.

క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవం ప్రవేశపెట్టించాడని ప్ర్రతీతి.

ఆస్ధానం లడ్డూ, కళ్యాణోత్సవ లడ్డూ, ప్రోక్తం లడ్డూలను తయారు చేస్తారు. ఆస్థాన లడ్డూలో మరికొన్ని పదార్థాలను కలుపుతారు. మిగిలిన రెండు మాత్రం పరిమాణంలో తేడాతో ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి.

లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.

ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.

శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.
ఆవు నెయ్యి – 165 కిలోలు, శెనగపిండి – 180 కిలోలు, చక్కెర – 400 కిలోలు, యాలుకలు – 4 కిలోలు, ఎండు ద్రాక్ష – 16 కిలోలు, కలకండ – 8 కిలోలు, ముంతమామిడి పప్పు -30 కిలోలును వినియోగిస్తారు.

శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలోనే పూర్తిగా లడ్డూలు తయారయ్యేవి. కట్టెల పొయ్యిల మీదే తయారయ్యేవి.

అయితే డిమాండ్ పెరగడంతో, ప్రస్తుతం ప్రత్యేకంగా బూందీ తయారీ కోసం ప్రత్యేకమైన భవనాన్ని ఏర్పాటు చేశారు.

అక్కడ తయారు చేసిన బూంధీ కన్వేయర్ బెల్టుద్వారా తిరిగి ఆలయంలోని పోటుకు చేరుతుంది. అక్కడ సాంప్రదాయ బ్రాహ్మణులు లడ్డూలను తయారు చేసి ట్రేలో వేసి తిరిగి బయటకు పంపుతారు.

ప్రతి రోజు కనీసం 3 లక్షల లడ్డూలు తయారవుతున్నాయి. 2019లో 12 కోట్ల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

[embedyt] https://www.youtube.com/watch?v=-Ay08iy7zUA[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*