తిరుమలలో కేటీఆర్ ‘లొల్లి’…. ఏమిటది?

తిరుమలలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు వివాదానికి కేంద్రంగా మారారు. ప్రస్తుతం తిరుమలలో ఆయనపై చర్చ నడుస్తోంది.

అదేంటి ఆయన మంత్రి తిరుమలకు రావచ్చు స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇందులో తప్పేంటి? అనేదేగా మీ ప్రశ్న. అంతవరకే అయితే ఎలాంటి తప్పూ లేదు. కానీ, ఆయన ఆలయంలోకి ప్రవేశించిన తీరుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.

చర్చే కాదు. విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వచ్చారు. స్వామి దర్శించుకున్నారు.

తిరుమల ఆలయంలో మహాద్వారం అంటే ప్రధాన ద్వారం గుండా నేరుగా ప్రవేశించాడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, పీఠాధిపతులు, మఠాధిపతులాంటి ఉన్నత పదవుల్లో ఉన్న కొద్దిమందికి మాత్రమే నేరుగా ప్రవేశం ఉంటుంది.

ఇక ప్రధాన ద్వారం వద్దనున్న బయోమెట్రిక్ తోవ నుంచి కేవలం ఆలయ సిబ్బంది, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, సభ్యులకు మినహా మరెవరికీ ప్రవేశం లేదు.

ఇతరులు ఎవ్వరైనా సరే క్యూలైన్ ద్వార ఆలయం ప్రవేశం చేయాల్సిందే. అయితే వైకుంఠ ఏకాదశి నాడు కేటీఆర్ కుటుంబ సభ్యులతో సహా టిటిడి బోర్డు సభ్యుడు, ఒక బోర్డు సభ్యుడు వెంటరాగా నేరుగా ఆ ద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు.

వైకుంఠ ద్వారాలను ముహూర్తం ప్రకారం తెరవాల్సి ఉండగా కేటీఆర్ కుటుంబ సభ్యుల కోసం 27 నిమిషాల ముందుగానే తెరచినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి అదే రోజున కొందరు ఉన్నత స్థాయి న్యాయమూర్తిలు దర్శనం కోసం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ కుటుంబానికి తొలి దర్శనం చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండానే జరిగాయి.

వారు వైకుంఠం లో వేచి ఉండగానే తెలంగాణ మంత్రిని దర్శనానికి పంపడం ఏ ప్రోటోకాల్ ప్రకారం జరిగిందనే విషయం ఇప్పుడు మరో వివాదంగా మారింది.

దీనిపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయంలో పాటించాల్సిన నియమాలను కూడా పాటించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

దీనిపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తిరుమలలో ఆలయ వ్యవహారాలను చూసే అధికారులు ఏమి చేస్తున్నట్లని నిలదీస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*