జనవరి 16న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో ‘గో మహోత్సవం’

తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీన గో మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

మకర సంక్రాంతి పర్వదినం అనంత‌రం కనుమ సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది.

ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం.

కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 6.00 గంటల నుండి వేణుగానం ప్రారంభమవుతుంది.

ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తారు.

8.00 గంటల నుండి 10.30 గంటల వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజన మరియు కోలాటాలు, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో సంకీర్త‌న  కార్య‌క్ర‌మాలు  నిర్వహిస్తారు.

ఉద‌యం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గజపూజ, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహించనున్నారు.

అనంత‌రం టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి హ‌రిదాసులు, డు..డు..బ‌స‌వ‌న్న నృత్యం ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

ఉద‌యం 11.45 గంటల నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుండి శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

గో మహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని  టిటిడి కల్పిస్తోంది.

ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత మరియు స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*