తిరుమలలో కిలాడీ లేడీలు జాగ్రత్త…!

కొండంత భక్తులే అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గోవిందనామస్మరణలు చేస్తున్నారు కదా అని గొంతు కలపవచ్చు. కానీ, వంటిపైనా, జేబులను జాగ్రత్తగా పెట్టుకోవాలి.

గోవింద నామస్మరణ ధ్యాసలో తన్మయత్వంలో మీలో మీకు ప్రదర్శించండి. అప్రమత్తంగా ఉండకపోతే మెడలో గొలుసులు జేబులో డబ్బులు ఖాళీ కావడం ఖాయం. కీలాడీ లేడీలుంటారు. తస్మాత్ జాగ్రత్త

మంగళవారం సాయంత్రం ఓ భక్తుడు తన పర్స్‌ ఎవరో కొట్టేశారని, ఆలయం ముందు సహస్ర దీపాలంకరణ సేవ వద్ద ఈ ఘటన జరిగిందని విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన విజిలెన్సు అధికారులు వివరాలు తెలుసుకున్నారు. భక్తుడు చెప్పిన ప్రకారం చోరీ జరిగి 20 నిమిషాలే అయ్యింది.

దీంతో విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది సీసీ ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించారు. కొందరు మహిళలు చోరీలు చేస్తున్నట్టు గుర్తించారు.

వెంటనే సిబ్బంది ఆలయం ముందుకు చేరుకున్నారు. సీసీ ఫుటేజ్‌లో చూసిన మహిళల కోసం గాలించారు. ఎట్టకేలకు శ్రీవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపులో ముగ్గురు మహిళలను చాకచక్యంగా పట్టుకున్నారు.

వారినుంచి రూ.65 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ముగ్గురు ఎవరు, వారితో పాటు ఎంతమంది తిరుమలలో ఉన్నారన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*