తిరుమలలో మనం దర్శించుకున్నది ఉత్తర ద్వారమేనా? కాదా? (వీడియో)

వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వేయి జన్మల పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.

అందుకే జనం తిరుమలకు వరుస కడతారు. కానీ, మనం తిరుమలలో దర్శనం చేసుకున్నది ఉత్తర ద్వారమేనా?

ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఉత్తర ద్వారమనుకుంటే ఉత్తరద్వారమే. కాదనుకుంటే.. కాదు. ఇదేంటి? రెండూ మీరే చెబుతారు అంటే నేను చరిత్ర మాత్రమే చెబుతాను అంటాను.

ఎప్పుడు వెలిసిందో తెలియని వేంకటేశ్వర విగ్రహం. రెండువేల ఏళ్ళ ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్న తిరుమల.

ఇలాంటి పరిస్థితులలో అక్కడున్న పరిస్థితుల ప్రకారం ఉత్తర ద్వారంలో మార్పులు ఉన్నట్లు గోచరమవుతోంది.

తిరుమల ఆలయం మనం అనుకున్న ప్రకారం మొదట కేవలం గర్భగుడి మాత్రమే ఉండేది. ఆ తరువాత చిన్న ప్రాకారం వెలిసింది.

దాని ముందు చిన్న శయన మండపం వెలిసింది.

7 శతాబ్ధం నాటికి కులశేఖర్ ఆళ్వార్ అనే కేరళ రాజు స్వామిపై అచెంచల భక్తితో తిరుమల చేరుకుని అక్కడే స్వామికి ఆరాధన చేసుకుంటే తిరుమలలో జీవితాన్ని ముగించారు.

ఆయన కోరిక మేరకు స్వామి అనుగ్రహంతో గర్భగుడికి గడపగా నిలిచారు. అదే కులశేఖర పడి. కింద ఉన్న వార్త చదివితే అదేంటో అర్థం అవుతుంది.

9వ శతాబ్ధం వరకూ గర్భగుడిచుట్టూ మండపాలు ఒకటి రెండు కూడా లేవు. భోగ శ్రీనివాసుని ప్రతిష్టింప చేసిన తరువాత శయన మందిరాన్ని నిర్మించారని చెబుతుతారు. ఈ వివరాలు కావాలంటే కింది కథనాన్ని చదవాలి.

సరిగ్గా గర్భగుడికి ఆనుకునే ఒకరు లేదా ఇద్దరు మనుషులు వెళ్ళేంత వెడల్పుతో గర్భాలయం ఆనుకునే ఒక మార్గం ఉండేది. ఆ తరువాత కాలంలో ఆ మార్గాన్ని మూసేశారు.

ఆ మూసేసిన మార్గానికి అటు ఇటుగా అంటే గర్భాలయ ద్వారానికి అటు ఇటుగా రెండు అరుగులు కట్టించి రామానుజల వారు అక్కడ రామాంజనేయ, సుగ్రీవ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

దానినే రాముల వారి మేడ అని మనం ప్రస్తుతం వ్యవహరిస్తున్నాం.

సరిగ్గా దీనినే అంతకు మునుపు ఉత్తర ద్వారంగా వ్యవహరించేవారు. వైకుంఠ ఏకాదశి నాడు ఈ మార్గం ద్వారానే జనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వారని తెలుస్తోంది.

ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామిని దర్శించుకుని బయటకు వచ్చేవారన్నమాట. చిన్న గుడి కావడంతో ప్రదక్షిణ అనంతరం స్వామిని దర్శించుకునే వారేమో.

తరువాత కాలంలో శయన మందిరం, రాముల వారి మేడ, సంపంగి ప్రాకారం వంటివి వచ్చాయి. గుడి చుట్టూ కొత్త కొత్త కట్టడాలు వచ్చాయి. అందులో భాగంగానే చుట్టూ 4, అడుగుల ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉత్తర ద్వార దర్శనంగా అమలులో ఉంది.

ప్రస్తుతం మనం స్వామిని దర్శించుకుని బయటకు వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రస్తుతం ఉన్న హుండీ వద్ద బయటకు వస్తామన్నమాట.

వెయ్యేళ్ళ కిందట ప్రస్తుతం వ్యవహరిస్తున్నా ‘ఉత్తర ద్వారం’ ఇది కాదన్నమాట వినిపిస్తోంది. గుడిలో విస్తరణలో వచ్చిన రకరకాల మార్పుల కారణంగా ఉత్తరద్వారం కూడా మారిందని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*