పాశురము-23
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
తెలుగు అర్థం
నల్లని అవిసెపువ్వు వంటి శరీరపు కాంతి కలిగిన ఓ శ్రీకృష్ణా, నీలముతో నిండిన అతసీపుష్పములాగా మెరిసే నీలమణి కాంతి కలిగిన చక్కనివాడా, స్వామీ,
వర్షాకాలములో గుహలో నిద్రించే మృగరాజులాగా మేల్కొని, రెండు కాళ్లను ముందుకు చాపి, నిగడదన్నునట్లుగా జూలును విదిల్చి, శరీరమును నలువైపులా కదిలించి, తీక్షణముగా ఒళ్లు విరుచుకొని, సాగి నిలబడి గట్టిగా గర్జిస్తూ, గుహ బయటకు వచ్చు సిం హము వలె గంభీరమైన ఆకారము కలిగిన ఓ శ్రీ కృష్ణా,
నీవు కూడా నీ భవనము నుండి మృగరాజువలె బయటకు వచ్చి, వీర సిం హాసనముపై కూర్చొని, దయతో మా ప్రార్థనను ఆలకించి, మేము వచ్చిన పనిని విని, నీ దయాదృష్టితో మమ్మల్ని అనుగ్రహించు స్వామి.
నీవు నీ మందిరము నుండి బయటకు వచ్చునప్పుడు, నీ అందమును చూసి ఆనందించవలసినదే కాని వర్ణించడము ఎవరి తరమూ కాదు.
ఆబోతు నడకలోని ఠీవి, ఏనుగు నడకలోని గాంభీర్యము, పెద్దపులి నడకలోని చురుకుదనము, సిం హము నడకలోని వైభోగము అంతా నీ నడకలో మేము చూసి ఆనందించునట్లుగా, నీ భవనము నుండి బయటకు వచ్చి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి.
నీవు వచ్చి రక్షించే వరకు వేచి వుండే ఓపిక, సహనము మాకు వున్నాయి. నీ ఎడబాటును భరించలేక మేమే నీ వద్దకు వచ్చాము. నీ దర్శనమును కలిగించి మమ్మల్ని అనుగ్రహించు, అని గోపికలతో కలసి ఆండాళ్ తల్లి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
Leave a Reply