తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -21

పాశురము-21

ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

తెలుగు అర్థం

ఆండాళ్ తల్లి ప్రార్థనకు నీళాదేవి మేల్కొని వచ్చి, గోపికలారా, మీరు భయపడకండి. మనము అందరము కలిసి ఆ స్వామిని లేపెదము అని శ్రీకృష్ణుడిని లేపుతున్నారు.

పాల పొదుగుల నుండి తీసిన పాలతో కుండలు కుండలుగా నిండి పొంగిపోయేలా ఎక్కువ పాలు ఇచ్చే శ్రేష్టమైన ఆవుల మందను కలిగిన నందగోపుడి ముద్దుల సుపుత్ర రత్నమా, ఓ కన్నయ్య, మేలుకోవయ్యా.

వేదములలో కీర్తించబడు పరబ్రహ్మ స్వరూపమా, మహిమాన్విత సంపద కలిగిన ఓ జ్యోతీస్వరూపమా, ఓ పరంజ్యోతీ, నిద్ర లేచి రా స్వామీ.

మేము నిన్ను విడువలేక, భక్తి పారవశ్యము వుప్పొంగిపోగా, నీ దివ్య పాదములను ఆశ్రయించి, నిన్ను కీర్తిస్తున్నామయ్యా. నీ వేణుగానము వలన, నీ చేతి స్పర్శ వలన, ఆవులు అపరిమితమైన పాలు ఇస్తున్నాయి.

అటువంటి గోసంపద కలిగిన నందకుమారా, లేచి రావయ్యా. ఆశ్రితరక్షకుడవై వున్న నీవు, సాథు రక్షణ కోసమే ఈ లోకములో స్వయముగా గోకులములో పుట్టావు.

నీవు రక్షించే భక్తుల యొక్క శత్రువులు, వారి శక్తిని అంతా పోగొట్టుకొని, నీ దివ్య పాదములను ఆశ్రయించినట్లుగా, మేము కూడా మా అహంకార మమకారములను పోగొట్టుకొని, నీ దివ్య మంగళకర విగ్రహమును మా కన్నులారా, తృప్తితీరా చూడాలి అని,

నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ, నీకు మంచి జరగాలి అని మంగళాశాసనములు చేస్తూ, నీ దగ్గరకు వచ్చాము. స్వామీ, నీవు లేచి వచ్చి మమ్మల్ని రక్షించు అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి మేల్కొలుపుతున్నారు. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*