ఆరంభమైన ఆండాళ్(గోదాదేవి) అమ్మవారి నీరాటోత్సవాలు

 గోవిందరాజ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు 07-1-2020 మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి.

13-01-2020 వరకు ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి..

ఇందులో భాగంగా ఉదయం స్వామి వారికి ధనుర్మాస, నిత్య కైంకర్యాలు నిర్వహించిన ఆనంతరం శ్రీఆండాళ్ అమ్మవారిని

పల్లకిలో వేంచేపు చేసి విశేషాలంకరణ గావించి 5.30 గంటల నుంచి చిన్నమాడ వీది, పూలమఠం, చిన్నబజారు వీది, రామాలయం నాలుగు మాడ వీదులు మీదుగా రామచంద్ర కట్టమీద మండపానికి చేరుకున్నారు.

అక్కడ ఏకాంత తిరుమంజనము, ఆస్థానం నిర్వహించారు.. తిరిగి సాయంత్రం 04.00 గంటలకు బంగారు తిరుచ్చి మీద కొలువుదీర్చి యదాప్రకారంగా ఊరేగింపుగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకున్నారు.

భక్తులు స్థానికులు అడుగుడుగునా హారతులు సమర్పించి అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

ఆయా కార్యక్రమాలలో ఆలయ ప్రత్యేక శ్ర వరలక్ష్మి, ఏఇఓ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు జ్ఞానప్రకాష్, శర్మ, టెంపుల్ ఇన్ స్పెక్టర్ కృష్ణమూర్తి, మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు..

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*