తెప్ప‌ల‌పై శ్రీ సోమ‌స్కంద‌స్వామివారి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో మూడోరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం శ్రీ సోమ‌స్కంద‌స్వామివారు తెప్ప‌ల‌పై భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

అదేవిధంగా బుధ‌వారం శ్రీ కామాక్షి అమ్మ‌వారు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*