ద్వాదశి ముక్కోటి చక్రస్నానం చూస్తారా…! (వీడియో) మీ కోసమే…!!

వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్రస్నానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.

చక్ర తళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణికి తీసుకువచ్చారు. అక్కడే పూజలు నిర్వహించారు. అనంతరం చక్ర తళ్వార్‌ను పుష్కరిణిలో ముంచుతారు. దీనినే చక్రస్నానం అంటారు.

ఈ సమయంలో మునకులు వేయడానికి భక్తులు ఎగబడ్డారు.

శ్రీ స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యం.

ద్వాదశి నాడు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

[embedyt] https://www.youtube.com/watch?v=HrIfTXKEV9g[/embedyt]

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*