తిరుపతి స్థానిక ఆలయాల్లో వైభ‌వంగా చ‌క్ర‌స్నానం

వైకుంఠ ద్వాద‌శిని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం టిటిడి స్థానిక ఆలయాలలో చ‌క్ర‌స్నానం వైభ‌వంగా జ‌రిగింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజనం జ‌రిగింది.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు త‌దిత‌న సుగంధ‌ద్ర‌వ్యాల‌తో వేడుక‌గా అభిషేకం చేశారు. ఆ త‌రువాత అర్చ‌కులు ప‌ద్మ‌పుష్క‌రిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం చేప‌ట్టారు.

శ్రీనివాసమంగాపురంలో …

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో వైకుంఠ ద్వాదశి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం చేప‌ట్టారు. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం వైభ‌వంగా జ‌రిగింది.

అప్పలాయగుంటలో ….

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా మంగ‌ళ‌వారం ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్లను పుర‌వీధుల్లో ఊరేగించారు.

ఉద‌యం 9 గంటలకు స్నపన తిరుమంజనం, ఉదయం 10 గంటలకు చక్రస్నానం వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమాల్లో ఆయా ఆల‌యాల అధికారులు, అర్చ‌కులు, విశేషంగా భ‌క్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*