కలశంపై ఉంచిన కొబ్బరికాయ పచ్చడి చేసుకుని తింటే తప్పేంటి ?

హిందువు అన్న తరువాత కలశం తెలియకుండా ఉండదు. చాలా మందికి అనుమానం కలుగుతుంది. దానిని ఏం చేయాలి? తినవచ్చా? దానిని తింటే తప్పేంటి? ఒక వేళ తిన కూడదంటే ఏం చేయాలి.?

ఈ అనుమానాలు చాలా మందిని పట్టిపీడుస్తుంటాయి. దానిని ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

నోములు, వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాలలోను కలశారాధన జరుగుతూ వుంటుంది. రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు, కుంకుమలు పెడతారు.

ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు.

నోములు, వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు గనుక, వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదు.

కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చు, ఒకవేళ అది కష్టమైతే దగ్గర్లోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు.

అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరి కాయలను ‘పూర్ణాహుతి’కి వాడుతుంటారు. ఈ కొబ్బరికాయను ఏం చేయాలి?

సాధారణంగా ఇంట్లో దేవుడికి కొట్టే కొబ్బరి కాయనైతే పచ్చడి చేసుకుని తింటాం. లేదా పాయసం చేసుకుని తింటాం. కలిశం పై కొబ్బరికాయను కుటుంబ సభ్యులు తినవచ్చు.

కానీ,పచ్చడిగా కాదు. ఇందులో ఉప్పు కారం వేయకూడదు.

తీపి కలిపి ప్రసాదంగా తయారు చేసి కనీసం ఒకరికైనా ఇతరులకు పంచిన తరువాత తింటే అది ప్రసాదం అవుతుంది. కనుక కలశంపై ఉంచిన ప్రసాదంలా పదిమందికి పంచాలి.

అలాగే బియ్యంతోపాటు బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు. అదే సమయంలో దానిని నదిలో నిమజ్జనం చేయవచ్చునని కూడా ఉంది. అలా చేయడం వలన ఏదోక ప్రదేశానికి చేరి కొబ్బరి మొలకెత్తి చెట్టుగా పెరుగుతుందనే భావన ఇందులో దాగి ఉంది.

తిరుమలలో ద్వాదశి చక్రస్నానం (వీడియో)

 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*