తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -20

పాశురము-20

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.

తెలుగు అర్థం

ముప్పై మూడు కోట్ల దేవతలకు రాక్షసుల వలన కలిగిన భయమును పోగొట్టిన సర్వేశ్వరుడా, నీవే సర్వస్వమూ అని భావించే మమ్మల్ని రక్షించలేవా స్వామీ.

మనసా వాచా కర్మణా ఒకే విధముగా వుండే నీతి మార్గము కలవాడా, అందరిని సమానముగా రక్షించే స్వభావము కలిగిన ఆశ్రిత రక్షకుడా, రక్షించుటయే స్వభావముగా గల నీవు, నీవారిమి అయిన మమ్మల్ని రక్షించకుండా వున్నావు.

శత్రువులకు భయము కలిగించే నిర్మలమూర్తీ, నిద్ర నుంచి లేచి రా స్వామీ అని ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుడిని లేపినది. కృష్ణుడు లేవకపోయేసరికి, దయామయురాలు అయిన నీళాదేవిని నిద్ర లేపుతున్నారు.

ముచ్చటైన కుంకుమభరిణ వలె సన్నని నడుము కలిగి, పగడపురంగుతో, సౌందర్యములోను, గుణగణములలోను పరిపూర్ణురాలివై వున్న ఓ లక్ష్మీస్వరూపురాలా, నిద్ర నుంచి లేచి రా తల్లి.

మా నోమునకు కావలసిన వస్తువులు అయిన అద్దము, వస్త్రములను ఇచ్చి, మా నోముకు మూల పురుషుడు అయిన ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణుడిని లేపి, మాకు పూజించే భాగ్యమును ప్రసాదించు తల్లి.

ఆ స్వామి యొక్క స్వరూప జ్ఞానము అనే అనుభవములో మునిగి, ఆ స్వామిలో లీనమయ్యే స్నానము అనే భాగ్యమును ప్రసాదించు అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ప్రార్థిస్తూ, నిద్రలేపుతున్నారు. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*