వామ్మో….! 32 రెండు గంటల తరువాత వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో వైకుంఠ ఏకాదశి తాకిడి విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. కనీసం రెండులక్షల మంది జనం తిరుమల చేరుకున్నట్లు తెలుస్తోంది.

తిరుమలలో జనవరి 6న ఏకాదశి, 7న ద్వాదశి సందర్భంగా వైకుంఠద్వారదర్శనం చేసుకోవడానికి భక్తులు శుక్రవారం సాయంత్రానికే తిరుమల చేరుకోవడం మొదలు పెట్టారు.

ముందుగానే రద్దీని ఊహించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 32 కంపార్టుమెంట్లు ఉండగా, అవి సరిపోవనే విషయాన్ని గుర్తించారు.

తిరుమలలోనే మకాం వేసి తిరుమల మాడవీధులలో కూడా తాత్కాలిక ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున షెడ్లు వేసి భక్తులను అక్కడ కూర్చోబెట్టారు.

శనివారం సాయంత్రం క్యూ కాంప్లెక్సులోకి అడుగుపెట్టిన భక్తులకు సోమవారం తెల్లవారు జామున 4.30 గంటలకు దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చారు.

అంటే కనీసం 32 గంటల పాటు వారు వేచి ఉండక తప్పలేదు. వీరు కాకుండా కనీసం మరో 80 వేల మంది భక్తులు ప్రస్తుతానికి తిరుమలలో స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.

వీరు కాకుండా ద్వాదశి వచ్చే భక్తులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం వేసి భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకోవడానికి కనీసం 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా తిరుమలలో సోమవారం ఉదయం కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, తెలంగాణ మంత్రులు, రెండు శాసనసభల ఎమ్మెల్యేలు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*