తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -19

పాశురము-19

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.

తెలుగు అర్థం

నలువైపులా దీపములు గుత్తులు గుత్తులుగా వెలుగుచుండగా, ఏనుగు దంతముతో చేయబడిన మంచముపై అందము, చల్లదనము, మెత్తదనము, మంచి పరిమళము, తెలుపుదనము అను ఐదు చక్కటి గుణములు కలిగిన మెత్తటి పరుపుపై

పరిమళించు అందమైన పువ్వులను జడలో పెట్టుకున్న నీళాదేవితో పవళించి వున్న విశాల వక్షస్థలము కలిగిన ఓ శ్రీకృష్ణా, తెల్లవారినది.

నీవు నిద్ర లేచి మాతో ఒక్కమాట అయినా మాట్లడవయ్యా, అని ఆండాళ్ తల్లి తన స్నేహితులతో కలిసి బ్రతిమలాడి లేపిననూ, ఆ శ్రీకృష్ణుడు లేవక పోయేసరికి, మళ్లీ నీళాదేవిని లేపుతున్నారు.

కాటుకను పెట్టుకున్న విశాలమైన అందమైన కన్నులు కలిగిన ఓ రాధా, నీవు నీ విభుడి ఎడబాటును ఎంత మాత్రమూ భరించలేక, స్వామిని లేవనీయకున్నావు. మేము ఇంతమందిమి వచ్చి లేపిననూ, లేవకపోయిరి.

ఇది నీకు తగదమ్మా. నీవు స్నేహశీలివి, ప్రేమమూర్తివి. ఈ లోకమంతా ఆ స్వామి కంటిచూపులో వుంటే, కాటుకతో నిండిన నీ కంటి చూపులో ఆ స్వామి నిలిచి వున్నారు. మీరు ఇరువురు నిద్ర లేచి మాకు దర్శనమీయండి.

మమ్మల్ని రక్షించమని స్వామికి చెప్పి, అనుగ్రహించు తల్లీ, అని ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి లక్ష్మీదేవిని మేల్కొలిపెను. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*