కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులపాటు జరుగనున్న తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభం కానున్నాయి.

ప్రతిరోజూ  సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు కపిలతీర్థంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై మొదటిరోజు శ్రీవినాయకస్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించనున్నారు.

అదేవిధంగా సోమ‌వారం శ్రీ సుబ్రమణ్య స్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*