తిరుమలలో వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుస్తారా..? మీకు అవకాశం ఉందేమో పరీక్షించుకోండి…!

తిరుమలలో వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరుస్తారు? తిరుమలకు పెరుగుతున్న తాకిడిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఏం నిర్ణయం తీసుకోనుంది? పది రోజులపాటు తెరిచి ఉంచుతారా?

కోర్టు కేసుల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. ఎవరు కేసు వేశారు? ఎందుకు వేశారు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే మనం ఈ వార్తను చదివి తీరాల్సిందే.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఉత్తరద్వార దర్శనం సాధారణంగా రెండు రోజులు కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది.

ఉత్తర ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచేలా ఆదేశించాలని టిటిడి ఓ దశలో ప్రయత్నం చేసింది.

ఆపై విమర్శలు రావడంతో విరమించుకుంది. అయితే ఇదే అంశంపై తాళ్లపాక రాఘవన్ అనే లాయర్ హైకోర్టును ఆశ్రయించారు.

పది రోజుల పాటు తెరచాలని అందరికి ఉత్తర ద్వార దర్శనం కల్గించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. జనవరి 6లోపు నిర్ణయం తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఆదివారం అత్యవసరంగా సమావేశం కానుంది. పీఠాధిపతులు, ఆగమ పండితుల సలహాల ఆధారంగా ఆదివారం పాలక మండలి సభ్యులతో చర్చించి తరువాత వైకుంఠద్వార దర్శనంపై పాలక మండలి నిర్ణయం తీసుకుంటుంది.

వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరవాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోమని టీటీడీని హైకోర్టు ఆదేశించినట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు.

జనవరి 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారి నేరుగా దర్శించుకోవాలని భావించే భక్తుల కోసం 2,500 టికెట్లను విడుదల చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.

శ్రీ వాణి ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చే భక్తులకు ఈ టికెట్లను అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. రూ. 10 వేలు విరాళంగా ఇచ్చే వారికి నేరుగా వీఐపీ హోదాలో వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని ఆయన తెలిపారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*