శ్రీవారి ఆలయంలోకి రాములవారికి అనుమతి లేదా? ఎవరు అడ్డుకున్నారు?

తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోకి శ్రీ మహా విష్ణువు అవతారాలలో ఒకరైన శ్రీరాముడికి ప్రవేశం ఉండేది కాదట. ఆయనను కూడా బయటే పెట్టేశారట.

వినడానికి వింతగా ఉంది కదూ. కానీ, నిజం చాలా కాలం అసలు తిరుమల వేంకటేశ్వర ఆలయంలో రాముల వారి విగ్రహమే లేదు. ఉన్నా లోపల ఉండేది కాదు.

మరి రాముల వారు అక్కడకు ఎలా వచ్చారు? వచ్చిన ఆయన ఆలయంలో ఎక్కడ ఉన్నారు. దానిని ప్రస్తుతం ఏమంటాం? రాముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

తిరుమల ఆలయం పూర్తిగా వైఖానస సంప్రాదాయం ప్రకారం నడుచుకునే ఒక ఆలయం. నేటికి అక్కడి కైంకర్యాలన్నీ వైఖానస సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి.

అప్పటి వరకూ ప్రధానంగా వేంకటేశ్వర స్వామి విగ్రహం అక్కడ ఉండేది. కేవలం వేంకటేశ్వర స్వామికి మాత్రమే పూజలు జరిగేవి. తరువాతీ కాలంలో భోగశ్రీనివాస మూర్తి విగ్రహం వచ్చింది. ఆయనకు అభిషేకం నిర్వహించడం మొదలు పెట్టారు.

రామానుజాచార్యులు తిరుమలకు చేరుకున్న తరువాత అక్కడ పాంచరాత్ర ఆగమాన్ని ప్రవేశపెట్టారు. రామానుజాచార్యుల వారు స్వతహాగా రాముల వారి భక్తులు.

ఈయన రాముల వారి విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకు వచ్చారు. రాములవారు, ఆంజనేయ స్వామి, సుగ్రీవులు, వానర యోధుల విగ్రహాలను అక్కడకు తీసుకు వచ్చారు.

అయితే ఆగమశాస్త్రం ప్రకారం రాములవారిని గర్భగుడిలోకి తీసుకెళ్ళడానికి వీలులేదు. కావున గర్భగుడి బయటపెట్టారు. అంటే.. ఎక్కడ ?

వేంకటేశ్వర ఆలయంలో మొదట కేవలం గర్భాలయం ఉండేది దానికి ఆనుకుని ఓ ప్రకారం ఉండేది. గర్భాలయానికి ఉన్న గడపను కులశేఖర పడి అంటాం.

అది తెలుసుకోవాలంటే… కింది లింకును క్లిక్ చేయండి.

http://www.edukondalu.com/2019/11/30/devotees-will-go-nearer-to-srivari-statue/

ఆ గడప తరువాత ఓ ప్రకారం ఉండేది. ప్రకారం అంటే సన్నని దారి లాంటిది, కాలక్రమేణా దానిని మూసేశారు. అక్కడ అరుగులు ఏర్పాటు చేశారు. ఆ అరుగులపైన రాముల వారిని ఏర్పాటు చేశారు.

ఆగమాలలో ఉన్న భేదాల కారణంగా రాముల వారు చాలా కాలం అంటే శతాబ్ధకాలం కూడా కావచ్చు ఆయన అరుగుపైనే ఉండి పూజలు అందుకున్నారు.

అందుకే దానికి రాముల వారి మేడ అని పేరు పెట్టారు. కాలక్రమేణా రాముల వారి విగ్రహాన్ని గర్భగుడిలోకి పంపించారు. చాలా కాలం ఆంజనేయుడు, సుగ్రీవుడు, వానర యోధుల విగ్రహాలను అక్కడే ఉన్న స్నపన మందిరం పెట్టేవారు.

తరువాత గుడి విస్తరణలో భాగంగా ఆంజనేయుడు, సుగ్రీవుడు, వానర యోధుల విగ్రహాలను ప్రస్తుతం తీర్థం, శఠారీ ఇస్తున్న ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*