తిరుమలలో తక్కువ రద్దీ : దర్శనానికి 4 గంటలు

** తిరుమల\|/సమాచారం **

ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు శుక్రవారం,
03.01.2020
ఉదయం 6 గంటల
సమయానికి,

తిరుమల: 18C°-26℃°

• నిన్న 60,328 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 07 గదుల్లో భక్తులు
సర్వదర్శనం కోసం వేచి
ఉన్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.54 కోట్లు,

• నిన్న 18,786 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,

/ / గమనిక / /

• నేడు డయల్‌ యువర్‌
ఈవో కార్యక్రమం, ఈ
కార్యక్రమంలో భక్తులు
తమ సందేహాలను,
సూచనలను టిటిడికి
ఫోన్‌ ద్వారా నేరుగా
మాట్లాడి తెలుపవచ్చు
నెం: 08772263261
(ఉ: 8.30 కి)

• ఈ రొజు స్వామివారి
భక్తులకి ఉ: 10 గంలకి
ఆన్‌లైన్‌లో ఏప్రెల్ నెల
శ్రీవారి ఆర్జిత సేవా
టికెట్లు,

• వైకుంఠ ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 4
నుండి 7వ తేదీ వరకు
దాతలకు ప్రత్యేక
దర్శనాలు, గదుల
కేటాయింపును
నిలిపివేయ‌డ‌మైన‌ది.

• వైకుంఠ ఏకాదశి, ద్వాదశి
సందర్భంగా జనవరి 5
నుండి 7వ తేదీ వరకు
వృద్ధులు, దివ్యాంగులు,
చంటిపిల్లల తల్లిదండ్రుల
ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు
చేయ‌డ‌మైన‌ది.

వయోవృద్దులు/ దివ్యాంగుల

• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తారు. ఉ: 7గంటల
కి నమొదు చేరుకోవాలి,
ఉ: 10 మ: 2 గంటలకి
దర్శనానికి అనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు/
ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం ప్రవేశం ద్వారా
స్వామి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,

తిరుప్పావై

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది.

ttd Toll free #18004254141

**** *తిరుమల\|/సమాచారం* ****

_*ఓం నమో వేంకటేశాయ!!*_

• ఈ రోజు శనివారం,
*04.01.2020*
ఉదయం 6 గంటల
సమయానికి,

_తిరుమల: *19C°-24℃°*_

• నిన్న *62,355* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో *01* గదుల్లో భక్తులు
సర్వదర్శనం కోసం వేచి
ఉన్నారు,

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*04* గంటలు
పట్టవచ్చును,

• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.35* కోట్లు,

• నిన్న *16,004* మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,

• నిన్న *20,830* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు

• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,

• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,

_*/ / గమనిక / /*_

_జనవరి 6న వైకుంఠ_
_ఏకాదశి, 7న ద్వాదశి_

• జనవరి 6న ఉ: 9 కి
స్వర్ణరథం, 7న ఉదయం
4.30 నుండి 5.30 గంటల
వరకు చక్రస్నానం,

_*ప్రత్యేక దర్శనాలు నిలుపుదల:*_

• జనవరి 5 – 7వ తేదీ
వరకు దాతలకు ఇచ్చే
సౌకర్యాలు రద్దు,

• జనవరి 5-7వ తేదీ వరకు
వృద్ధులు, దివ్యాంగులకు,
చంటిపిల్లలతల్లిదండ్రుల,
ప్రత్యేక దర్శనాలు రద్దు,

• జనవరి 4-8వ తేదీ వరకు
దివ్యదర్శనం టోకెన్లు,
టైంస్లాట్‌ సర్వదర్శనం
టోకెన్లు రద్దు,

• జనవరి 5-8వ తేదీ వరకు
అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు

_*ఏకాదశి దర్శనాం:*_

• జనవరి 6న ఉదయం
ధ‌నుర్మాస కైంక‌ర్యాల
అనంత‌రం 2 గంటల
నుండి వైకుంఠ ద్వార
దర్శనం ప్రారంభం, ఉ:5
తరువాత సర్వదర్శనం
ప్రారంభం.

• జ‌న‌వ‌రి 7వ తేదీ రాత్రి 12
గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు
వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
క‌ల్పించనున్నారు,

• జనవరి 5 తెల్లవారి
నుండి భక్తులను క్యూ
లోకి అనుమతిస్తారు,

• భక్తుల సౌకర్యార్థం జనవరి
6న 24 గంటల పాటు
ఘాట్‌ రోడ్లు తెరిచి
ఉంటుంది,

• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,

• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.

*_తిరుప్పావై_*

_ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది._

*ttd Toll free #18004254141*

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*