తిరుప్పావై ఏం చెబుతుంది? పాశురం -18

పాశురము-18

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.

తెలుగు అర్థం

మదించిన ఏనుగును కూడా తన భుజబలముతో ఆపగలిగే శక్తి కలిగిన నందగోపాలుడి యొక్క కోడలా, ఓ నీళాదేవీ, పరిమళములు వెదజల్లు జుట్టు కలదానా, లేచి తలుపులు తెరువు. మీ మామగారు ఉదార స్వాభావులు.

నీవు కూడా మీ మామగారి వలె మా కోరికను తీర్చుము. నీ అందమైన జుట్టు యొక్క దివ్య పరిమళముల చేత ఆ శ్రీకృష్ణుడిని వశపరచుకున్న నిన్ను చూస్తే, మాకు చాలా ఆనందము కలుగుతోంది.

తలుపులు తెరచి, మాపై దయ చూపుము. నీ కాటుక కన్నుల చాటు నుంచి స్వామిని మాకు చూపించు. నాలుగు దిక్కుల నుండి తెల్లవారినదని కోళ్లు కూస్తున్నాయి. మీ తోటలోని మాధవీలత పందిరి మీద కోయిల కూడా కూస్తున్నది.

బంతుల వంటి గుండ్రని వ్రేళ్లు కలిగిన ఎర్ర తామర పువ్వుల వంటి నీ సుతిమెత్తని చేతులతో తలుపులు మెల్లగా తెరవమ్మా. నీ చేతికి గల అందమైన గాజులు గలగలమని చప్పుడు చేయునట్లుగా, నీవు ఆనందముగా తలుపులు తెరువుము.

మనకు ప్రియమైన శ్రీకృష్ణుడిని మేము దర్శించి, సేవించు భాగ్యమును మాకు కలుగ చేయి తల్లీ, అను ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి లక్ష్మీదేవిని మేల్కొలిపెను. కాని ఆమె లేవలేదు. ఇదియే ఇందులోని అభిప్రాయము.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*