2019లో తిరుమల ఆదాయం ఎంతో తెలుసా ?

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల ఆదాయం ఎంతో తెలుసా…? విక్రయించబడిన లడ్డూలు ఎన్నో తెలుసా? మొత్తం ఆదాయం ఎంత? వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే.

తిరుమల పుణ్యక్షేత్రంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి క్యూ కడుతుంటారు. వారి సంఖ్య ప్రతి రోజు కనీసం 80 వేల నుంచి 1 లక్ష మంది వరకూ ఉంటుంది.

ఇక పర్వదినాలలో ఆ సంఖ్య 1.5 లక్షలకు చేరుకుంటుంది. వారు స్వామివారికి సమర్పించిన కానుకలు కావచ్చు వారు హుండీ ద్వారా విడిది ఉండడవలన, లేదా లడ్డూలను కొనుగోలు చేయడం ద్వారా 2019 లెక్కలను టిటిడి విడుదల చేసింది.

టీటీడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 2,78,02,047 (2.78 కోట్లు) మంది స్వామిని దర్శించుకున్నారు.

ఇది గత యేడాదితో పోల్చుకుంటే 4 శాతం పెరుగుదలతో అదనంగా ఇంచుమించు 11 లక్షల మంది అదనంగా స్వామిని దర్శించుకున్నారు.

ఇక లడ్డూలను చూస్తే 12.50 కోట్ల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసి భక్తులకు అందించింది. గత ఏడాదితో పోల్చుకున్నప్పుడు 13 శాతం వృద్ధి రేటు ఉంది. గతేడాది 11 కోట్ల లడ్డూలు పెరిగాయి.

ఇక హుండీ ఆదాయం విషయానికి వస్తే రూ. 1161 కోట్ల ఆదాయం వచ్చింది ఇతరు రూపాలలో వచ్చే ఆదాయం దీనికి అదనంగా ఉంటుంది.

పట్టిక ద్వారా వివరాలను పరిశీలించవచ్చు.

వ.సం. కార్యక్రమం 2018 2019 పెరుగుదల  వృద్ధి శాతం
1 దర్శనం చేసుకున్నవారు 2,68,02,047 2,78,90,179 10,88,132 4.1
2. లడ్డూ ప్రసాదం 11,06,49,027 12,49,80,815 1,43,31,788 13.0
3. అన్నప్రాసదం ( సత్రంలో) 6,08,76,434 6,45,73,250 36,96,816 6.1
4 అన్నప్రసాదం(క్యూకాంప్లెక్సులో) 3,86,12,950 3,70,97,416 -15,15534 -3.9
5 తలనీలాలు ఇచ్చినవారు 1,12,99,055 1,16,61,625 3,62,570 3.2
6 హుండీ ఆదాయం రూ. 1066.48 కోట్లు రూ. 1161.74 కోట్లు రూ. 95.25 కోట్లు 8.9
7. విడిది ద్వాారా రూ. 78.68 కోట్లు రూ. 83.71 కోట్లు రూ. 5.3 కోట్లు 6
8 గదులు పూర్తయిన విధానం 99 శాతం 106 శాతం 7 7
మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*