తిరుమలలో బంగారు బావి నీరు కలుషితమయ్యాయా? తరువాత ఏం చేశారు?

తిరుమలలో ఆలయలో బంగారు బావి అనే మాట పదే పదే వింటుంటాం. అసలు ఈ బంగారు బావి ఏంటి ఎప్పుడూ కనిపించదే? ఆ బావిని దేనికి వినియోగిస్తారు? అందులో అసలు నీరుంటుందా? అంటే? ఏమో? అనే మాటే వినిపిస్తుంది.

అస్సులు ఆ బావి ఎప్పుడు ఏర్పండింది. దానిని దేనికి వినియోగిస్తారు? అనే అంశాలను తెలుసుకుందాం. తిరుమలలో ఈ మధ్యనే కార్తిక దీపం వెలిగించినప్పుడు బంగారు బావి వద్ద కూడా దీపం వెలిగించారు.

బంగారు బావి అనే మాట వినడమే కాని దాని ఆవశ్యకత ఏంటో మనకు తెలియదు. శ్రీ మహావిష్ణుడు శ్రీదేవి భూదేవి సమేతుడై తిరుమల చేరుకున్న సందర్భంగా ఆయనకు వంటా వార్పు చేయడానికి శ్రీదేవి తవ్విన బావే బంగారు బావి.

భూదేవి తవ్విన బావే పూల బావి. చాలా కాలం తరువాత ఇవి రెండూ కూడా కలగర్భంలో కలిసిపోయాయి.

వేంకటేశ్వర స్వామికి తొలి అర్చకుడుగా ఉన్న గోపినాథ దీక్షితుల వారి వద్ద రంగదాసు అనే సహాయకుడు ఉండేవాడు. అతను ఓ రోజు స్వామి నీటికోసం అన్వేషణ ప్రారంభించినప్పుడు బంగారు బావి బయటపడింది.

తరువాత తొండమాన్ చక్రవర్తి స్వామి ఆదేశానుసారం, విమాన గోపురానికి బంగారు తాపడం, పూల బావికి రాతి కట్టుడు చేయించారు.

స్వామి వారి అభిషేకం కోసం పాపవినాశనం, ఆకాశగంగ నుంచి నీటి తెచ్చే వారు. అయితే జోరున వర్షం పడుతున్న సందర్భంలో వాటిని తీసుకు రావడం కష్ణమయ్యింది.

ఇలాంటి సందర్భంలో యామనాచార్యులు(అప్పటి అర్చకులు) లక్ష్మీదేవిని ప్రార్థించి బంగారు బావిలోని నీటిని వినియోగించడం మొదలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ఈ బావినే అక్కడి అన్న ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.

ఇది ఎక్కడ ఉందీ అంటే దర్శనానంతరం వకుళమాత దర్శనం కోసం వెళ్ళే ప్రదేశంలో ఉంటుంది. అయితే తిరుమలలో భక్తుల విడిది సముదాయాలు ఎక్కువ కావడంతో తిరుమలలోని బంగారు బావిలోని నీరు ఓ దశలో కలుషితయ్యాయి.

అనంతరం దానిని శుభ్రం చేశారు. కొన్నాళ్ళపాటు పాపానాశనం, ఆకాశగంగల నుంచి తెచ్చిన నీటిని వినియోగించారు.

తరువాత భూగర్భ డ్రైనేజీ విధానం తిరుమలలో అమలులోకి వచ్చిన తరువాత బంగారు బావిని శుభ్రం చేసి ఆ నీటినే ప్రస్తుతం వినియోగిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*